Mosagallaku Mosagadu Pan World Film: 50 ఏళ్ల క్రితమే సూపర్‌ స్టార్‌ కృష్ణ పాన్‌ వరల్డ్‌ సినిమా - 50 దేశాల్లో బంపర్‌ హిట్‌

Mosagallaku Mosagadu Pan World Film: నేడు 'బాహుబలి', 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాలతో తెలుగు సినిమా గ్లోబల్ స్థాయిలో రచ్చ చేస్తోంది. కానీ, సరిగ్గా 55 ఏళ్ల క్రితమే, ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లోనే ఒక తెలుగు సినిమాను 50 దేశాల్లో విడుదల చేసి, అంతర్జాతీయ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఘనత సూపర్ స్టార్ కృష్ణది.

Balachander
Updated on: 17 April 2026 10:25 AM IST
First Telugu Pan World Film Krishna’s Mosagallaku Mosagadu Released in 50 Countries
X

Mosagallaku Mosagadu Pan World Film

Mosagallaku Mosagadu Pan World Film: నేడు 'బాహుబలి', 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాలతో తెలుగు సినిమా గ్లోబల్ స్థాయిలో రచ్చ చేస్తోంది. కానీ, సరిగ్గా 55 ఏళ్ల క్రితమే, ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లోనే ఒక తెలుగు సినిమాను 50 దేశాల్లో విడుదల చేసి, అంతర్జాతీయ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఘనత సూపర్ స్టార్ కృష్ణది. ఆ అద్భుత ప్రయోగమే 'మోసగాళ్లకు మోసగాడు'.

8 లక్షల బడ్జెట్‌...50 లక్షలు వసూలు

ఆ కాలంలో హాలీవుడ్ కౌబాయ్ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సమయంలో, అలాంటి కథాంశాన్ని మన తెలుగు ప్రేక్షకులకు అందించాలని కృష్ణ నిర్ణయించారు. హాలీవుడ్ క్లాసిక్ కథలకు స్ఫూర్తిగా, రచయిత ఆరుద్ర స్థానికతకు తగ్గట్టుగా కథను రూపొందించారు. ఈ సినిమా పూర్తిగా కొత్త జానర్‌ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఈ చిత్రాన్ని కేవలం రూ. 8 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కించారు. రాజస్థాన్ ఎడారుల్లో గుర్రపు స్వారీలు, గన్ ఫైట్లు, నిధి వేట వంటి సన్నివేశాలతో ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇచ్చింది. ఫలితంగా ఈ సినిమా అప్పట్లోనే రూ. 50 లక్షల వరకు వసూళ్లు సాధించి భారీ విజయాన్ని అందుకుంది. అంటే దాదాపు 6 రెట్లు లాభం తెచ్చింది. అప్పటి నుంచే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కౌబాయ్‌ సినిమాలు రావడం మొదలుపెట్టాయి. ఆ తరువాత చిరంజీవి నుంచి మహేష్‌బాబు వరకు కౌబాయ్‌ సినిమాల్లో నటించి మెప్పించారు.

50 దేశాల్లో సంచలనం

ఈ తెలుగు కౌబాయ్‌ సినిమా మోసగాళ్లకు మోసగాడు కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీకే పరిమితం చేయకుండా ది ట్రెజర్‌ పేరుతో ఇంగ్లీష్‌లో డబ్‌ చేయించారు. పాటలను తీసేసి కేవలం సినిమా మాత్రమే డబ్‌ అయింది. ఈ సినిమాను 50 దేశాల్లో విడుదల చేయించారు. ఆ రోజుల్లో తెలుగు సినిమా అన్ని దేశాల్లో విడుదల కావడం సంచలనమే. విడుదలైన అన్ని దేశాల్లో సూపర్‌ హిట్టయింది. అప్పట్లో ఇలాంటి ప్రయత్నం ఓ సాహసం అనే చెప్పాలి. తెలుగు సినిమా పేరు అంతర్జాతీయ స్థాయిలో వినిపింయడంలో ఈ మోసగాళ్లకు మోసగాడు కీలకపాత్ర పోషించింది. సాంకేతిక ప్రయోగాలు, కొత్త కథలు, భిన్న జానర్లతో ముందుకు సాగిన కృష్ణ, తెలుగు సినీ పరిశ్రమకు మార్గదర్శిగా నిలిచారు. నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్న సినిమాలకు ఈ సినిమా ఒక ప్రారంభ బిందువుగా చెప్పుకోవచ్చు.




Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story