రాపో23 కోసం ఇండస్ట్రీ టాప్ టెక్నీషియన్‌ను దించిన ఉస్తాద్!
Ram Pothineni: ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా నటిస్తూ, స్వయంగా ఆయనే మెగాఫోన్ పట్టి దర్శకత్వం వహిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘RAPO23’.
రాపో23 కోసం ఇండస్ట్రీ టాప్ టెక్నీషియన్‌ను దించిన ఉస్తాద్!
Ram Pothineni: ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా నటిస్తూ, స్వయంగా ఆయనే మెగాఫోన్ పట్టి దర్శకత్వం వహిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘RAPO23’ నుంచి చిత్ర యూనిట్ ఒక అదిరిపోయే అధికారిక ప్రకటనను విడుదల చేసింది. రామ్ పోతినేని కెరీర్‌లో 23వ చిత్రంగా, ఒక విభిన్నమైన నియో-నోయిర్ (Neo-noir) క్రేజీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
విజువల్ వండర్స్‌ను సృష్టించే మాస్టర్ క్రాఫ్ట్స్‌మెన్ ఎంట్రీ
ఈ చిత్రానికి విజువల్స్ పరంగా మరింత గ్రాండ్‌నెస్ తీసుకురావడానికి టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ భారీ చిత్రాలకు పనిచేసిన స్టార్ సినిమాటోగ్రాఫర్ 'తిరు' (DOP Tirru) గారిని రంగంలోకి దించారు. గతంలో ఆయన 'క్రిష్ 3', 'ఆచార్య', గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' వంటి భారీ విజువల్ వండర్స్‌కి కెమెరా వర్క్ అందించిన సంగతి తెలిసిందే. తిరు గారి ఎంట్రీతో ‘RAPO23’ విజువల్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నాయని స్పష్టమవుతోంది.
రామ్ పోతినేని ఎమోషనల్ ట్వీట్
ఈ క్రేజీ అప్‌డేట్‌ను రామ్ పోతినేని తన అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా ద్వారా పంచుకుంటూ తన సంతోషాన్ని, ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. “విజువల్ వండర్స్‌ను ఆవిష్కరించే ఒక మాస్టర్ క్రాఫ్ట్స్‌మెన్.. ఇప్పుడు #RAPO23 నియో-నోయిర్ ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి విజనరీ సినిమాటోగ్రాఫర్ తిరు గారు మా ప్రాజెక్ట్‌లోకి రావడం మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం” అంటూ ట్వీట్ చేశారు.
A master craftsman behind the visual spectacles is ready to enter into the Neo-noir world of #RAPO23 ❤️🔥
— RAPO Cinematics (@RAPO_Cinematics) June 6, 2026
Honoured to have the visionary cinematographer @DOP_Tirru Garu on board.
Starring the Energetic Star @ramsayz 💥
Written & Directed by #𝙍𝘼𝙋𝙊
Produced by Krishna… pic.twitter.com/WSO0BXSSIK
మొదటిసారి దర్శకుడిగా రామ్.. సొంత బ్యానర్‌లో నిర్మాణం
ఈ సినిమాకు మరో ప్రత్యేకత ఏమిటంటే.. రామ్ పోతినేని హీరోగా నటిస్తూనే, ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ మొదటిసారి దర్శకత్వ బాధ్యతలను కూడా చేపట్టారు. 'రాపో సినిమాటిక్స్' (RAPO Cinematics) పతాకంపై రామ్ పోతినేని సోదరుడు కృష్ణ పోతినేని ఈ భారీ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తిరు లాంటి స్టార్ టెక్నీషియన్ తోడవ్వడంతో ఈ నియో-నోయిర్ క్రేజీ థ్రిల్లర్ పై అంచనాలు ఒక్కసారిగా రెట్టింపయ్యాయి. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.




