Tharun Bhascker: హీరోయిన్ తో తరుణ్ భాస్కర్ రిలేషన్‌షిప్!
Tharun Bhascker: తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా రిలేషన్‌షిప్‌పై ఆయన తల్లి గీతా భాస్కర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో సంచలన నిజాలు బయటపెట్టారు.
Tharun Bhascker: హీరోయిన్ తో తరుణ్ భాస్కర్ రిలేషన్‌షిప్!
Eesha Rebba: టాలీవుడ్‌లో మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ పేరు ఇప్పుడు మరో ప్రత్యేక కారణంతో సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్న కల్ట్ హిట్ చిత్రం 'ఈ నగరానికి ఏమైంది'కి సీక్వెల్‌గా వస్తున్న ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ చిత్రం నవంబర్ 19న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలవుతున్న తరుణ్ తాజాగా జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో వ్యక్తిగత విషయాల ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు.
ముఖ్యంగా ఈ వేడుకలో ఆయన తల్లి, నటి గీతా భాస్కర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా, అంతటా స్వీట్ సర్‌ప్రైజ్‌గా మారాయి.
కొంతకాలంగా తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బా ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ వినిపించిన సంగతి తెలిసిందే. అయితే, వాటిపై ఎప్పుడూ స్పందించని ఈ జంట గురించిన అసలు నిజాన్ని తాజాగా తరుణ్ తల్లి గీతా భాస్కర్ స్వయంగా ఓపెన్ స్టేట్‌మెంట్ ద్వారా బయటపెట్టారు.
వేదికపై ఎమోషనల్ అవుతూ గీతా భాస్కర్ మాట్లాడుతూ గత రెండేళ్లుగా తమ కుటుంబం, ముఖ్యంగా తరుణ్ భాస్కర్ ఎన్నో ఒడిదుడుకులను, ఇబ్బందులను ఎదుర్కొన్నాడని తెలిపారు. కోర్టు కేసులు, కొత్త ఇల్లు నిర్మాణం వంటి తీవ్రమైన ఒత్తిడి మధ్య తరుణ్ సతమతమయాడని, సినిమా పనులతో అసలు ఇంటికే రాని రోజులు కూడా అనేకం ఉన్నాయని ఆమె గుర్తుచేసుకున్నారు.
అలాంటి శ్రమతో కూడిన కష్టకాలంలో.. అర్ధరాత్రి 2 గంటలకు లేదా తెల్లవారుజామున 4 గంటలకు ఇంటికి వచ్చిన తరుణ్‌కు ప్రేమగా భోజనం పెట్టి, ధైర్యం చెప్పడానికి ఒక అద్భుతమైన సోల్‌మేట్ దొరికిందని గీతా భాస్కర్ ఎంతో ఆప్యాయంగా వెల్లడించారు. ఆమె మరెవరో కాదంటూ.. అందరూ ఊహించినట్టే టాలెంటెడ్ హీరోయిన్ ఈషా రెబ్బా పేరును ఆమె బహిరంగంగా ప్రకటించారు.
ఈషా కేవలం ఒక మంచి స్నేహితురాలు మాత్రమే కాదని, తరుణ్‌కు అన్ని వేళలా అండగా నిలిచిన ఒక బెస్ట్ సోల్‌మేట్ అని గీతా భాస్కర్ కొనియాడారు. ఈషా అందించిన నైతిక మద్దతు, ప్రోత్సాహం వల్లే తరుణ్ ఈ సినిమాను ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తి చేయగలిగాడని ఆమె ప్రశంసించారు.
ఒక తల్లి స్వయంగా పబ్లిక్ వేదికపై కొడుకు ప్రేమ వ్యవహారాన్ని, ఈషా గొప్పతనాన్ని అందరి ముందూ అంగీకరించడంతో త్వరలోనే ఈ సెలబ్రిటీ జంట పెళ్లి పీటలెక్కబోతోందంటూ నెటిజన్లు తెగ సంబరపడిపోతున్నారు. సినిమా సక్సెస్ జోష్ ఒకవైపు ఉంటే, నిజ జీవితంలోనూ తరుణ్‌కు తోడుగా అరుదైన సోల్‌మేట్ దొరకడంతో అభిమానులు ఈ జోడీకి సోషల్ మీడియా వేదికగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.




