Goodachari 2: అడివి శేష్ 'గూఢచారి 2' వేరే లెవెల్.. ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్

Goodachari 2: అడివి శేష్ హీరోగా వస్తున్న స్పై థ్రిల్లర్ 'గూఢచారి 2' అద్భుతంగా ఉందని నటుడు రాహుల్ రవీంద్రన్ ప్రశంసించారు.

Ravi
By Ravi
Published on: 5 Sept 2026 5:37 PM IST
Goodachari 2
X

Goodachari 2: అడివి శేష్ 'గూఢచారి 2' వేరే లెవెల్.. ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్

Goodachari 2: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'గూఢచారి 2'పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. 2018లో వచ్చిన 'గూఢచారి' సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ చిత్రానికి కొనసాగింపుగా భారీ స్థాయిలో ఈ సీక్వెల్ తెరకెక్కుతోంది. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గురించి తాజాగా ప్రముఖ నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఆయన ఇచ్చిన ఫస్ట్ రివ్యూ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.

సాధారణంగా అడివి శేష్ తన సినిమాల షూటింగ్ 90 శాతం పూర్తయిన తర్వాతే తనకు చూపిస్తారని, కానీ 'గూఢచారి 2' సినిమాను 70 శాతం పూర్తయిన దశలోనే చూసే అవకాశం దక్కిందని రాహుల్ రవీంద్రన్ వెల్లడించారు. ఎడిటింగ్ రూమ్‌లో ఈ మూవీ రషెస్ చూసిన తర్వాత తాను ఎంతగానో థ్రిల్ అయ్యానని ఆయన తెలిపారు. సినిమాలో విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, స్టోరీ, ట్విస్ట్‌లు వేరే లెవెల్‌లో ఉన్నాయని ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ఇండియన్ స్పై థ్రిల్లర్ల స్టాండర్డ్స్‌ను ఈ సినిమా కచ్చితంగా మరోస్థాయికి తీసుకువెళ్లనుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ రవీంద్రన్ లాంటి అభిరుచి గల డైరెక్టర్ నుంచి వచ్చిన ఈ పాజిటివ్ రివ్యూ అభిమానుల్లో విపరీతమైన జోష్ నింపుతోంది.

ఈ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మాతలు ఏమాత్రం రాజీ పడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇమ్రాన్ హష్మీ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. వామిక గబ్బా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా బడ్జెట్ రూ. 100 కోట్లు అని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఫస్ట్ పార్ట్ బడ్జెట్‌తో పోలిస్తే ఇది సుమారు 16 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. ఫ్రాన్స్, ఇటలీ, స్విట్జర్లాండ్ లాంటి ఎన్నో విదేశీ లొకేషన్లలో ఈ మూవీకి సంబంధించిన భారీ యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరిస్తున్నారు.

సినిమాలోని ప్రతి ఫ్రేమ్ హాలీవుడ్ రేంజ్‌లో ఉండేలా మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గూఢచారి 2లో కథానాయకుడి పాత్ర మరింత పవర్ ఫుల్ గా డిజైన్ చేశారు. స్పై యూనివర్స్ తరహాలో కథను అల్లుతూ, దేశ భద్రతకు సంబంధించిన కీలకమైన ఇతివృత్తాన్ని ఇందులో ఎంచుకున్నారు. మొదటి భాగంలో తండ్రి కోసం వెతికే కుమారుడిగా కనిపించిన శేష్, ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ ఉగ్రవాద నెట్‌వర్క్‌ను ఛేదించే పవర్‌ఫుల్ రా ఏజెంట్‌గా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇందుకోసం ఆయన ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ శిక్షణ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.

డిజిటల్, శాటిలైట్ హక్కుల ద్వారా సినిమా విడుదలకు ముందే రూ. 80 కోట్లు పైగా బిజినెస్ జరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గూఢచారి 2 కచ్చితంగా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని అభిమానులు నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story