Gummadi and NTR: పరకాయ ప్రవేశం అంటే ఇదే...చిన్న వయసులోనే పెద్ద పాత్రలు

వయసుకు మించిన పాత్రల్లో నటించిన మెప్పించిన గుమ్మడి ఎలా ఆ పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేశావారో...ఎన్టీఆర్‌తో వచ్చిన విబేధాలకు ఎలా ఫుల్‌స్టాప్‌ పెట్టారో తెలుసుకుందాం.

Balachander
Published on: 18 Jun 2026 2:09 PM IST
Gummadi and NTR: పరకాయ ప్రవేశం అంటే ఇదే...చిన్న వయసులోనే పెద్ద పాత్రలు
X

Gummadi and NTR: సినీ రంగంలో నిలబడాలి అంటే ఎలాంటి పాత్రల్లో అయినా జీవించాలి. చిన్నదా పెద్దదా అన్నది ముఖ్యం కాదు. పరకాయ ప్రవేశం చేసి నటించాలి. ఫలానా సినిమాలో ఫలానా పాత్ర అంటే... ఆ పాత్రమాత్రమే గుర్తుకు రావాలి. యాక్టర్‌ కాదని అంటారు నిపుణులు. నిజమే ఇది. వయసు చిన్నదే అయినా...బరువైన పాత్రలు చేసిన నటుడు ఎవరూ అంటే మనకు ఠక్కున గుర్తుకు వచ్చేపేరు గుమ్మడి. గుమ్మడి తన వయసుకు మంచిన పాత్రల్లో నటించి మెప్పించాడు. ముఖ్యంగా ఎన్టీఆర్‌ సినిమాల్లో ఆయన అన్నగా, స్నేహితుడిగా, తండ్రిగా ఎన్నో బాధ్యతాయుతమైన పాత్రల్లో మెప్పించారు. ఒకానొక సమయంలో గుమ్మడికి తన పాత్రల ద్వారా ఎన్టీఆర్‌ని మించి పేరు రావడంతో ఇద్దరి మధ్య కొన్ని వివాదాలు చోటు చేసుకున్నాయి. మరి ఆ వివాదాలు ఎలా తొలగిపోయాయో తెలుసుకుందాం.

చిన్న వయసు...పెద్ద పాత్రలు

గుమ్మడి చేసిన పాత్రలన్నీ దాదాపుగా పెద్దగానే ఉంటాయి. చిన్న వయసులోనే ఆయన అత్యంత బలమైన పాత్రల్లో నటించాడు. ఆయన చేసిన పాత్రల్లో మనకు బాగా గుర్తుండిపోయే వాటిల్లో బలరాముడి పాత్ర ఒకటి కాగా రెండోది మహామంత్రి తిమ్మరుసు పాత్ర. ఈ సినిమాలో కృష్ణదేవరాయలుగా ఎన్టీఆర్‌ నటించినా...మహామంత్రి తిమ్మరుసు చుట్టూనే కథ నడుస్తుంది. ఈ పాత్రలో గుమ్మడి ఒదిగిపోయి నటించాడు. ఎవరికీ సాధ్యంగాని అందలాన్ని అధిరోహించాడు గుమ్మడి. ఆహార్యం, అభినయం ఆయనకు ఆయనే సాటి. మహామంత్రి తిమ్మరుసు పాత్రకు గాను ఆయనకు గుమ్మడికి ఉత్తమ నటుడిగా రాష్ట్రపతి పతకం లభించింది. ఈ చిత్రానికి రాష్ట్రపతి రజత పతకం రావడం విశేషం. ఎన్టీఆర్‌ భళా అని నటించినా... ఈ సినిమాలో గుమ్మడి అంతకు మించేలా నటించాడని విమర్శకులు సైతం ప్రసంశించడం విశేషం. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా 1962లో విడుదలై అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది.

వివాదాలు...పరిష్కారాలు

నటుడిగా ఎదిగే సమయంలో చుట్టుపక్కల వారి నుంచి ముంపు పొంచి ఉంటుంది. వివాదాలు సృష్టించేవారి నుంచి జాగ్రత్తగా ఉండాలి. కాలం ఏదైనా సరే అలాంటి వారితో జరభద్రం అనే సంఘటనలు ఆరోజుల్లోనే ఉన్నాయి. ఎన్టీఆర్‌, గుమ్మడి సమ ఉజ్జీలుగా నటిస్తున్న సమయంలో ఇద్దరి మధ్య కొంతమంది కారణంగా కొన్ని విబేధాలు చోటుచేసుకున్నాయి. కొంతకాలం ఇద్దరు నటులు ఒకరికొకరు దూరంగా ఉన్నారు. అయితే, ఆ తరువాత కొంతకాలానికి గుమ్మడి స్వయంగా ఎన్టీఆర్‌ ఇంటికి వెళ్లి మాట్లాడి సమస్యలను పరిష్కరించుకున్నారు. విబేధాలను పక్కనపెట్టి ఇరువురూ ఎప్పటిమాదిరిగానే కలిసి నటించారు. ఎంతగా ఎదుగుతుంటే... వెనుకనుంచి లాగేవారి సంఖ్య కూడా అంతే పెరుగుతుంది. జాగ్రత్తగా ఉండాలని గుమ్మడి నటజీవితమే హెచ్చరికగా చెబుతోంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story