Teja Sajja: అవును ఆ అమ్మాయితోనే పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన తేజ సజ్జా..!

Teja Sajja: టాలీవుడ్ యంగ్ హీరో, 'హనుమాన్' స్టార్ తేజ సజ్జా త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు.

Gagan kumar
Published on: 23 Oct 2026 8:36 AM IST
Teja Sajja
X

Teja Sajja: అవును ఆ అమ్మాయితోనే పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన తేజ సజ్జా..!

Teja Sajja: టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో, 'హనుమాన్' స్టార్ తేజ సజ్జా త్వరలోనే ఒక ఇంటివారు కాబోతున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన వివాహంపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు తెరదించుతూ, తాను త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు స్వయంగా ప్రకటించారు. ఈ సందర్భంగా తన పెళ్లికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

తేజ సజ్జా తన పెళ్లి వేడుకలను ఎంతో ఘనంగా, ప్రత్యేకంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే నెలలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థ వేడుక జరగనుంది. డిసెంబర్‌ నెలలో రాజస్థాన్‌లోని చారిత్రాత్మక నగరం ఉదయ్‌పుర్‌లో అత్యంత వైభవంగా వివాహం చేసుకోబోతున్నారు. పెళ్లి వేడుక ఉదయ్‌పుర్‌లో ముగిసిన అనంతరం, సినీ పరిశ్రమలోని ప్రముఖులు, స్నేహితుల కోసం హైదరాబాద్‌లో ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.

తమది పూర్తిగా పెద్దలు కుదిర్చిన వివాహం అని తేజ స్పష్టం చేశారు. తమ తల్లిదండ్రులే ఈ సంబంధాన్ని నిశ్చయించినట్లు తెలిపారు. కాబోయే వధువు కుటుంబానికి సినీ పరిశ్రమతో ఎటువంటి సంబంధం లేదు. వారి కుటుంబం టెక్నాలజీ బిజినెస్ రంగానికి చెందింది. ఆమె అమెరికాలోనే పెరిగారని, గ్లామర్ ప్రపంచానికి పూర్తిగా దూరంగా ఉంటారని చెప్పారు. ఆమె స్వభావం తనకు బాగా నచ్చిందని, భవిష్యత్తులో కూడా ఆమె ప్రైవసీకి ఎలాంటి భంగం కలగకుండా చూసుకుంటానని తేజ సజ్జా ఆత్మీయంగా పేర్కొన్నారు.

బాలనటుడిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి, 'ఓ బేబీ' చిత్రంలో కీలక పాత్రతో మెప్పించిన తేజ, 'జాంబిరెడ్డి'తో హీరోగా మారారు. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ 'హను-మాన్‌', ఇటీవల 'మిరాయ్‌' చిత్రాలతో వరుసగా బంపర్ హిట్లు కొట్టి మోస్ట్ వాంటెడ్ హీరోగా మారారు.

ప్రస్తుతం ఆయన 'జాంబీ రెడ్డి 2' చిత్రంలో నటిస్తుండగా, త్వరలోనే 'మిరాయ్ 2', 'హనుమాన్' సీక్వెల్‌లలో అలరించనున్నారు. అంతేకాకుండా, అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న 'ట్రైటర్స్' రియాలిటీ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్నారు. ఒకవైపు వరుస ప్రాజెక్టులతో కెరీర్‌లో దూసుకుపోతూ, మరోవైపు కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న తేజ సజ్జాకు అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.