Happy Birthday Mahesh Babu: బాక్సాఫీస్ రారాజు.. వేలమంది పసి ప్రాణాలు కాపాడిన రియల్ హీరో
Happy Birthday Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన ఐకానిక్ సినిమాలు, బాక్సాఫీస్ రికార్డులు, సామాజిక సేవ, రాజమౌళితో చేయబోయే భారీ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ విశేషాలు ఇక్కడ చూడండి.
Happy Birthday Mahesh Babu: బాక్సాఫీస్ రారాజు.. వేలమంది పసి ప్రాణాలు కాపాడిన రియల్ హీరో
Mahesh Babu Birthday : తెలుగు సినిమా చరిత్రలో తనదైన ట్రెండ్ సెట్టింగ్ యాక్టింగ్‌తో, బాక్సాఫీస్ రికార్డుల విధ్వంసంతో సూపర్ స్టార్‌గా ఎదిగిన ఘట్టమనేని మహేష్ బాబు పుట్టినరోజు ఈ రోజు. బాలనటుడిగా వెండితెరకు పరిచయమై, కథానాయకుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు మహేష్ బాబు. మహేష్ బాబు అంటేనే బాక్సాఫీస్ వద్ద రికార్డుల సృష్టి. టాలీవుడ్ చిత్రసీమలో బెంచ్ మార్క్ సెట్ చేసిన పలు మైలురాయి చిత్రాలు ఆయన ఖాతాలో ఉన్నాయి.
2003లో వచ్చిన ఒక్కడు తెలుగు సినిమాలో కల్ట్ క్లాసిక్ ఆక్షన్ డ్రామాగా నిలిచి, బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పోకిరి చిత్రం అప్పటివరకు ఉన్న అన్ని టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసి, రీజినల్ సినిమా స్థాయిని పెంచింది. దూకుడు , శ్రీమంతుడు , మిలియన్ డాలర్ల క్లబ్‌ను ఓవర్సీస్ మార్కెట్‌లో సునాయాసంగా విస్తరించిన ఘనత మహేష్‌దే. మహర్షి, సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట వంటి సినిమాలు నాన్-రాజమౌళి సినిమాల్లో వరుసగా రూ. 100 కోట్లకు పైగా షేర్ సాధించి, తన బాక్సాఫీస్ స్టామినాని నిరూపించారు.
మహేష్ బాబు కేవలం సినిమాలకే పరిమితం కాలేదు. ఆంధ్రా హాస్పిటల్స్, తన స్వచ్ఛంద సంస్థ ద్వారా ఇప్పటివరకు వేలమంది నిరుపేద పిల్లలకు ఉచితంగా హార్ట్
ఆపరేషన్లు చేయించి, నిజమైన సూపర్ స్టార్ అనిపించుకున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ దర్శకధీర ఎస్.ఎస్. రాజమౌళితో మహేష్ బాబు కాంబినేషన్.
ఆఫ్రికన్ అడవుల నేపథ్యం, ఇండియానా జోన్స్ తరహా గ్లోబ్-ట్రావెలర్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ భారీ చిత్రం హాలీవుడ్ స్థాయి టెక్నాలజీతో తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ పాన్- వరల్డ్ సినిమాలో మహేష్ ఒక సరికొత్త, రగ్గడ్ లుక్‌లో అలరించనున్నారు. ఈ ప్రాజెక్ట్ అంతర్జాతీయ వేదికలపై భారతీయ సినిమా జెండాను మరింత ఎత్తులో ఎగరవేయడం ఖాయంగా కనిపిస్తోంది.




