కన్నీటి పర్యంతమైన హేమమాలిని, కూతురు అహానా.. నెటిజన్లను కదిలిస్తున్న వీడియో!
Dharmendra: భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాల ప్రదానోత్సవం సోమవారం సాయంత్రం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
కన్నీటి పర్యంతమైన హేమమాలిని, కూతురు అహానా.. నెటిజన్లను కదిలిస్తున్న వీడియో!
Dharmendra: భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాల ప్రదానోత్సవం సోమవారం సాయంత్రం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అత్యంత వైభవంగా జరిగింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 131 మంది ప్రముఖులకు గౌరవప్రదమైన పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. ఈ వేడుకలో ఆరు దశాబ్దాలకు పైగా భారతీయ సినిమాకు ఎనలేని సేవలు అందించి, గతేడాది కన్నుమూసిన లెజెండరీ నటుడు ధర్మేంద్రకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన ‘పద్మవిభూషణ్’ (మరణానంతరం) ప్రకటించింది.
రాష్ట్రపతి భవన్‌లో ఉద్వేగభరిత దృశ్యాలు
ధర్మేంద్ర తరపున ఈ ప్రతిష్టాత్మక అవార్డును స్వీకరించేందుకు ఆయన భార్య, సీనియర్ నటి హేమమాలిని, కుమార్తె అహానా డియోల్ ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మవిభూషణ్ స్క్రోల్‌ను అందుకుంటున్న సమయంలో హేమమాలిని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. వేదికపై తల్లి అవార్డు తీసుకుంటున్న దృశ్యాన్ని చూస్తూ కింద కూర్చున్న కుమార్తె అహానా డియోల్ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. చప్పట్లు కొడుతూనే ఆమె ఎమోషనల్ అయిన విజువల్స్ నెటిజన్లను సైతం కదిలిస్తున్నాయి. ధర్మేంద్రకు పద్మ పురస్కారం దక్కడం ఇది మొదటిసారి కాదు. గతంలో 2012లోనే ఆయన చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గాను ‘పద్మభూషణ్’ అవార్డును అందుకున్నారు.
https://twitter.com/PIB_India/status/2058877563687330239
90వ పుట్టినరోజుకు ముందే విషాదం
గత ఏడాది నవంబర్ 24న, తన 90వ పుట్టినరోజుకు కొన్ని రోజుల ముందే ధర్మేంద్ర శ్వాసకోశ సమస్యలతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో ఆయన మరణించినట్లు కొన్ని పుకార్లు రాగా, కుటుంబ సభ్యులు వాటిని ఖండించారు. అనంతరం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్న ఆయన, కుటుంబ సభ్యుల సమక్షంలోనే ప్రశాంతంగా కన్నుమూశారు. దాదాపు 65 ఏళ్ల సుదీర్ఘ సినీ కెరీర్ కలిగిన ధర్మేంద్ర నటించిన చివరి చిత్రం ‘ఇక్కిస్’ (Ikkis) ఆయన మరణానంతరం ఈ ఏడాది జనవరి 1న విడుదలైంది. ధర్మేంద్రకు మొదటి భార్య ప్రకాష్ కౌర్ ద్వారా బాలీవుడ్ స్టార్ హీరోలు సన్నీ డియోల్, బాబీ డియోల్ జన్మించగా.. హేమమాలిని ద్వారా ఈషా డియోల్, అహానా డియోల్ జన్మించారు.
President Droupadi Murmu confers #PadmaVibhushan upon veteran actor #Dharmendra Singh Deol (Posthumous), popularly known as the ‘He-Man’ of Bollywood
— PIB India (@PIB_India) May 25, 2026
One of the most versatile and successful actors in the history of Hindi cinema, he left an indelible mark on Indian cinema… pic.twitter.com/HQ2lwzMtXO




