Hollywood Disaster Movie: 1400 కోట్లుపెట్టి తీస్తే...వచ్చింది 6 కోట్లే

కంటెంట్‌ ఉన్నోడికి కటౌట్‌ అక్కర్లేదు డూడ్‌ అన్నట్టుగా...ఎంత భారీ బడ్జెట్‌ పెట్టి సినిమా తీసినా అందులో కథాబలం లేకుంటే బాక్సాఫీస్‌ వద్ద చతికిల పడుతుంది అనడంలో సందేహం లేదు.

Balachander
Updated on: 12 May 2026 1:07 PM IST
Hollywood Disaster Movie: 1400 కోట్లుపెట్టి తీస్తే...వచ్చింది 6 కోట్లే
X

Hollywood Disaster Movie: కంటెంట్‌ ఉన్నోడికి కటౌట్‌ అక్కర్లేదు డూడ్‌ అన్నట్టుగా...ఎంత భారీ బడ్జెట్‌ పెట్టి సినిమా తీసినా అందులో కథాబలం లేకుంటే బాక్సాఫీస్‌ వద్ద చతికిల పడుతుంది అనడంలో సందేహం లేదు. బాలీవుడ్‌ అంటే మనకు గుర్తుకు వచ్చేది భారీ గ్రాఫిక్స్‌ మాయాజాలం. ఎంత మాయాజాలం ఉపయోగించినా కొన్ని సినిమాలు ఫెయిల్‌ అవుతుంటాయి. కానీ, ఏ సినిమా కూడా డెజర్ట్ వారియర్‌ అంతటి ఘోరమైన పరాయజం పొందలేదు. బహుశా బాలీవుడ్‌ చరిత్రలో అత్యంత భారీ డిజాస్టర్‌ మూవీ ఇదే అయి ఉండొచ్చు. ఎందుకంటే ఈ సినిమా 99.6 శాతం పెట్టుబడిని కోల్పోయింది. ఇండస్ట్రీలో చెత్త రికార్డును మూటగట్టుకుంది.

నమ్మశక్యం కాని నష్టాలు - 1400 కోట్లు

సుమారు వెయ్యి కోట్లకు పైగా బడ్జెట్‌ ఉంటేనే అది హాలీవుడ్ సినిమా అవుతుంది. అంతకంటే తక్కువ బడ్జెట్‌తో వచ్చిన సినిమాలు కూడా భారీ విజయాలు సాధించాయి. ఒకవేళ సినిమా ప్లాపైనా సరే పెట్టిన పెట్టబడిలో కనీసం 50 శాతం వరకు తిరిగి వస్తుంది. కానీ, డెజర్ట్‌ వారియర్‌ సినిమా పెట్టిన పెట్టుబడిలో ఒక్కశాతం కూడా తిరిగి రాలేదంటే ఆశ్చర్యమే. ఈ సినిమా నిర్మాణంలో సౌదీ అరేబియాకు చెందిన ఎంబీసీ గ్రూప్‌ పాలుపంచుకుంది. సుమారు 1400 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టింది. అంతర్జాతీయ స్థాయిలో సినిమాను రిలీజ్‌ చేశారు. అయితే, ఊహించిన దానికంటే భారీగా డిజాస్టర్‌ అయింది. ఈ సినిమా బాక్సీఫీస్‌ వద్ద కేవలం 6 కోట్లు మాత్రమే వసూలు చేసింది.

స్టార్ కాస్ట్ ఉన్నా తప్పని పరాభవం

ఈ సినిమాలో నటించింది సామాన్యులు కాదు...మార్వెల్‌ కెప్టెన్‌ అమెరికా ఫేమ్‌ ఆంథోనీ మాకీ, ఆస్కార్‌ విజేత బెన్‌ కింగ్ల్సీ, ఇషా హార్ట్‌ వంటి ఫేమస్‌ నటులు ఎందరో ఈ సినిమాలో నటించారు. అంతేకాదు, రైజ్‌ ఆఫ్‌ది ప్లానెట్‌ ఆఫ్‌ ది ఏప్స్‌ చిత్రానికి దర్శకత్వం వహించిన రూపెర్డ్‌ వ్యాట్‌ దర్శకత్వం వహించారు. ఏప్స్‌ సినిమా ఏ స్థాయిలో హిట్టైందో చెప్పక్కర్లేదు. భారీ క్యాస్టింగ్‌, సూపర్‌ హిట్‌ దర్శకుడు అందరూ కలిస్తే డెజర్ట్‌ వారియర్‌ భారీ హిట్‌ అవుతుందని అనుకున్నారు. కానీ, రివర్స్‌లో డెజర్ట్‌ కాస్త డిజాస్టర్‌గా మారింది. దీనికి ప్రధాన కారణం కథలో తగిన పట్టు లేకపోవడం, కథనాలు చప్పగా ఉండటం, సరైన ప్రమోషన్స్‌ లేకపోవడమే.

ఎందుకు ఈ పరిస్థితి?

ఈ ఏడాది ఏప్రిల్‌లో వచ్చిన ఈ సినిమాకు భారీ హైప్‌ క్రియేట్‌ అయింది. కానీ, మొదటి షో నుంచి నెగెటీవ్‌ టాక్‌ సొంతం చేసింది. గ్రాఫిక్స్‌ మాయాజాలం ఉన్నా...అందులో బలమైన కథ లేకపోవడంతో ప్రేక్షకులు తిరస్కరించారు. గ్రాఫిక్స్‌మీద సినిమాను నడపలేం కదా. విమర్శకుల నుంచి కూడా భారీ విమర్శలు వచ్చాయి. ఫలితంగా ఈ సినిమా ప్రపంచంలోనే అత్యధికంగా నష్టాలు చవిచూసిన సినిమాగా చరిత్రకెక్కింది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story