Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ కోసం మమిత బైజు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.?
Vishwanath & Sons: సూర్య హీరోగా నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న నటి మమిత బైజు తీసుకున్న రెమ్యునరేషన్ గురించి ఆసక్తికర విషయాలు వైరల్ అవుతున్నాయి.
Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ కోసం మమిత బైజు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.?
Vishwanath & Sons: సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న యువ నటి మమిత బైజు తాజాగా నటిస్తున్న చిత్రాలకు సంబంధించి సోషల్ మీడియాలో భారీ చర్చ జరుగుతోంది.
సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రంలో ఈ భామ ఒక కీలకమైన పాత్రలో నటించింది. ప్రేమలు సినిమాతో అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ టాలెంటెడ్ నటి క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. దీనివల్ల ఆమె తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెడుతూ భారీ స్థాయిలో అవకాశాలను అందుకుంటోంది.
ఈ ప్రాజెక్ట్‌లో మమిత బైజు నటించినందుకు గాను ఏకంగా రూ.1.5 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. అటు సూర్య ఈ సినిమా కోసం రూ. 25 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు టాక్.
ఈ చిత్రంలో సూర్య సరసన ఆమె కీలక పాత్రలో నటించి.. మంచి మార్కులు కొట్టేసింది. ఈ చిత్రంలో సూర్యతో పాటు రవీనా టండన్ అలాగే రాధికా శరత్‌కుమార్ వంటి నటులు కూడా కీలక పాత్రల్లో కనిపించిన సంగతి తెలిసిందే.
ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడమే కాదు.. కేవలం రెండు రోజుల్లోనే రూ. 100 కోట్ల మార్క్ దాటేసి.. సూర్య కెరీర్‌లోనే అతి తక్కువ రోజుల్లోనే అత్యధిక వసూళ్ళు సాధించిన సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది.
అలాగే ఈ సినిమా కంటే ముందే 'కరప్పు' సినిమాతో మళ్ళీ సక్సెస్ ట్రాక్‌లో పడ్డాడు సూర్య. కాగా, విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రంలో మమిత కీలక పాత్రలో కనిపించింది. సినిమా ఆద్యంతం సాగే ఈ పాత్రలో మమిత తన నేచురల్ యాక్టింగ్‌తో ప్రేక్షకులను అలరించింది.




