CM Vijay: త్రిష సినిమాకు విజయ్ బంపర్ ఆఫర్..స్పెషల్ పర్మిషన్ ఇస్తూ ఉత్తర్వులు
CM Vijay: హీరో సూర్య, త్రిష కాంబినేషన్‌లో వస్తున్న 'కరుప్పు' సినిమాకు తమిళనాడు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
CM Vijay: త్రిష సినిమాకు విజయ్ బంపర్ ఆఫర్..స్పెషల్ పర్మిషన్ ఇస్తూ ఉత్తర్వులు
Suriya Karuppu: కోలీవుడ్ స్టార్ సూర్య, స్టార్ బ్యూటీ త్రిష జంటగా నటించిన క్రేజీ ప్రాజెక్ట్ ‘కరుప్పు’. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సరిగ్గా సినిమా రిలీజ్ కావడానికి కొన్ని గంటల ముందు, తమిళనాడు నూతన ముఖ్యమంత్రి విజయ్ చిత్ర యూనిట్‌కు అదిరిపోయే శుభవార్త అందించారు.
ప్రత్యేక షోలకు గ్రీన్ సిగ్నల్
తమిళనాడులో ‘కరుప్పు’ సినిమా విడుదలకు సంబంధించి ప్రత్యేక షోలకు ప్రభుత్వం అనుమతి నిలిపింది. రేపు ఉదయం 9 గంటల నుంచే స్పెషల్ షోలు వేసుకునేందుకు వీలుగా సీఎం విజయ్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణంగా పెద్ద సినిమాలకు లభించే ఈ వెసులుబాటు, ఇప్పుడు ‘కరుప్పు’ కు లభించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల హీరో సూర్య, దర్శకుడు ఆర్జే బాలాజీ , నిర్మాతలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సినిమా కథాంశం సామాజిక న్యాయం, కోర్టుల పనితీరు, లాయర్ల పోరాటం చుట్టూ సాగుతుంది. సూర్య మరోసారి లాయర్ పాత్రలో తన నట విశ్వరూపం చూపించబోతున్నారని టీజర్, ట్రైలర్ల ద్వారా స్పష్టమవుతోంది. సూర్య-త్రిష కాంబో దాదాపు దశాబ్దం తర్వాత మళ్ళీ వెండితెరపై మెరవనుండటం ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ. ఇదిలా ఉంటే ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించడం, అదే సినిమాకు ఇప్పుడు సీఎం విజయ్ ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడం తమిళనాడు హాట్ టాపిక్‌గా మారింది.




