Allu Arjun: కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన అల్లు అర్జున్.. ‘ఐకాన్జా’ పేరుతో సరికొత్త క్రియేటివ్ ఆఫీస్ ప్రారంభం!

Allu Arjun: అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా కొత్త క్రియేటివ్ ఆఫీస్ ‘ఐకాన్జా’ను ప్రారంభించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న అప్డేట్.

Arun Chilukuri
Published on: 1 Oct 2026 5:16 PM IST
Allu Arjun
X

Allu Arjun: కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన అల్లు అర్జున్.. ‘ఐకాన్జా’ పేరుతో సరికొత్త క్రియేటివ్ ఆఫీస్ ప్రారంభం!

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లో మరో కొత్త మైలురాయిని అధిగమించారు. తనకు ఎంతో ఇష్టమైన తాత, ప్రముఖ హాస్య నటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా అక్టోబర్ 1న ఆయన తన కొత్త క్రియేటివ్ ఆఫీస్‌ను ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రత్యేకమైన కార్యాలయానికి ‘ఐకాన్జా’ (Iconza) అనే ఆసక్తికరమైన పేరును పెట్టారు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

‘‘ఒక సరికొత్త ఆఫీస్.. ఒక సరికొత్త ఆరంభం. మా తాతగారు అల్లు రామలింగయ్య గారి జయంతి సందర్భంగా సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నాం’’ అంటూ అల్లు అర్జున్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

అల్లు అర్జున్ కొత్తగా ఏర్పాటు చేసిన ‘ఐకాన్జా’ కేవలం ఒక సాధారణ కార్యాలయంగా కాకుండా, భవిష్యత్ సృజనాత్మక ఆలోచనలకు కేంద్రంగా ఉండేలా దీన్ని తీర్చిదిద్దారు. సినిమా కథలపై చర్చలు, కొత్త కాన్సెప్టుల రూపకల్పన, భవిష్యత్ ప్రాజెక్టుల ప్లానింగ్ అంతా ఇకపై ఇక్కడి నుంచే జరగనుంది.

కుటుంబ సినిమా వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ, తన ఆలోచనలకు తగినట్లుగా ఈ కార్యవిధాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేయించారు . ప్రస్తుతం అల్లు అర్జున్ వరుస పాన్-ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉండగా, ఈ కొత్త ఆఫీస్ వేదికగా ఆయన తదుపరి చిత్రాల పనులు మరింత వేగవంతం కానున్నాయి.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.