Ott Movies: ఓటీటీలో బ్లాక్‌బస్టర్ల రచ్చ..ఆ సినిమా మాత్రం అసలు మిస్ కావద్దు!

Ott Movies: ఈ వారం మూవీ లవర్స్‌కు పండగే.

Gagan kumar
Published on: 4 Sept 2026 9:31 AM IST
Ott Movies
X

Ott Movies: ఓటీటీలో బ్లాక్‌బస్టర్ల రచ్చ..ఆ సినిమా మాత్రం అసలు మిస్ కావద్దు!

Ott Movies: వెండితెర ప్రేమికులకు, డిజిటల్ ప్రియులకు ఈ వారం పండగే పండుగ! గత వారం 'టాక్సిక్' వంటి పెద్ద సినిమా ఆశించిన స్థాయిలో అలరించలేక బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచినప్పటికీ, ఈ వారం మాత్రం అటు థియేటర్లలోనూ, ఇటు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలోనూ వైవిధ్యమైన సినిమాల సందడి మొదలైంది. ఈ వారం థియేటర్లలో చిన్న, మధ్య తరహా చిత్రాలు భారీ సంఖ్యలో పోటీపడుతున్నాయి. కామెడీ, డ్రామా, యాక్షన్ ఎంటర్‌టైనర్లుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రాలివే.. అల్లరి నరేష్ హీరోగా రంభ ఊర్వశి మేనక , ఐ యామ్ గేమ్ ,బెత్లెహోమ్ కుటుంబ యూనిట్, మీర్జాపూర్, మా రాముడు అందరివాడు, ధర్మస్థల నియోజకవర్గం, రోమాంచికం మొదలగు సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి.

ఇక ఇంటి పట్టునే ఉండి వినోదాన్ని ఆస్వాదించాలనుకునే వారి కోసం ప్రధాన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సూపర్ హిట్ సినిమాలు, క్రైమ్ థ్రిల్లర్లు అందుబాటులోకి వచ్చేసాయి. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్, రితికా నాయక్, సత్య నటించిన కామెడీ హారర్ థ్రిల్లర్ థియేటర్లలో మంచి విజయాన్ని అందుకుని, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. లోకేష్ కనగరాజ్, వామికా గబ్బి ప్రధాన పాత్రల్లో నటించి రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సెన్సేషనల్ మూవీ 'సన్ నెక్స్ట్' లోకి వచ్చేసింది.

అజయ్ దేవగణ్, రితేష్ దేశ్‌ముఖ్, అర్షద్ వార్సీ నటించిన ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది. మాధవన్, ప్రియమణి, సత్యరాజ్ నటించిన బయోపిక్ మూవీ 'జి.డి. నాయుడు' నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కుంచకో బోబన్, లిజోమోల్ జోసే నటించిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'సోనీ లివ్' వేదికగా ఓటీటీ ప్రియులను అలరిస్తోంది. సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ నటించిన గ్రామీణ నేపథ్య కథ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. వీటితో పాటు 'జగమే సంగీతం' ,పలు హాలీవుడ్ వెబ్ సిరీస్‌లు, సినిమాలు కూడా తెలుగు డబ్బింగ్‌తో స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story