Jana Nayagan: దళపతి విజయ్‌కి వరుస షాకులు.. రిలీజ్‌‌కు ముందే లాస్ట్ సినిమాకు రూ.120 కోట్ల లాస్!

దళపతి విజయ్ ఆఖరి చిత్రం 'జన నాయగన్'కు భారీ షాక్ తగిలినట్లు సమాచారం. అమెజాన్ ప్రైమ్ వీడియోతో కుదిరిన రూ.120 కోట్ల ఓటీటీ డీల్ రద్దయిందనే వార్తలు ఫిలిం సర్కిల్‌లో కలకలం రేపుతున్నాయి.

Ganesh
Published on: 24 March 2026 7:45 PM IST
Thalapathy Vijay’s Final Film Jana Nayagan Faces ₹120 Cr Loss
X

Jana Nayagan: దళపతి విజయ్‌కి వరుస షాకులు.. రిలీజ్‌‌కు ముందే లాస్ట్ సినిమాకు రూ.120 కోట్ల లాస్!

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న లాస్ట్ చిత్రం కావడంతో 'జన నాయగన్'పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న ఈ చిత్రానికి, తాజాగా భారీ ఓటీటీ డీల్ రద్దయినట్లు సోషల్ మీడియా వేదికగా సంచలనం సృష్టిస్తున్నాయి. తమిళ సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సుమారు రూ.120 కోట్లకు దక్కించుకుందని టాక్. అయితే, సినిమా షూటింగ్, రిలీజ్ డేట్ విషయంలో నిర్మాణ సంస్థ 'కేవీఎన్ ప్రొడక్షన్స్' నుంచి సరైన స్పష్టత రాకపోవడంతో, ప్రైమ్ వీడియో వారు ఈ భారీ డీల్‌ను రద్దు చేసుకున్నట్లు తాజాగా సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం జరుగుతోంది.

మేకర్స్‌కు భారీ నష్టం..

ఒకవేళ ఈ వార్తే నిజమైతే, నిర్మాణ సంస్థకు ఇది కోలుకోలేని దెబ్బ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. సినిమా విడుదలకు ముందే ఇంత పెద్ద మొత్తం చేజారడం సినిమా బిజినెస్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. ఇది వరకు కూడా ఈ సినిమా ఓటీటీ హక్కుల విషయంలో పలు రూమర్స్ వచ్చినప్పటికీ, తాజా పరిణామాలు మేకర్స్‌ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ మూవీలో పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని అనిరుధ్ రవిచందర్ అందిస్తున్నారు. ఈ సినిమా తెలుగులో 'జన నాయకుడు' పేరుతో విడుదలకు రెడీ అవుతుంది. రాజకీయాల్లోకి వెళ్లే ముందు విజయ్ నటిస్తున్న ఆఖరి సినిమా కావడంతో, ఫ్యాన్స్ ఈ అడ్డంకులన్నీ తొలగిపోయి సినిమా త్వరగా థియేటర్లలోకి రావాలని కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో రిలీజ్‌కు ముందే రూ.120 కోట్ల లాస్ అంటూ జరుగుతున్న ప్రచారంపై ఇప్పటి వరకు చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Ganesh

Ganesh

2022లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 4 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. లైఫ్ స్టైల్, బిజినెస్‌, మూవీస్, స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా సినిమా గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story