Janhvi Kapoor: 'పెద్ది'పై జాన్వీ పశ్చాత్తాపం..తప్పు చేశానంటూ సంచలన కామెంట్స్!
Janhvi Kapoor: రామ్ చరణ్, బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో వచ్చిన ‘పెద్ది’ సినిమాలో తన పాత్రపై జాన్వీ కపూర్ ‘కాఫీ విత్ కరణ్’ షోలో సంచలన వ్యాఖ్యలు చేసింది.
Janhvi Kapoor: 'పెద్ది'పై జాన్వీ పశ్చాత్తాపం..తప్పు చేశానంటూ సంచలన కామెంట్స్!
Janhvi Kapoor: రామ్ చరణ్, బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో భారీ అంచనాల నడుమ వచ్చిన ‘పెద్ది’ చిత్రం వివాదాల సుడిగుండంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. సినిమాలో కథ పరిధి, యావరేజ్ టాక్ పక్కన పెడితే.. కథానాయకి జాన్వీ కపూర్ పాత్రను చిత్రీకరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. కేవలం గ్లామర్, అభ్యంతరకర కెమెరా యాంగిల్స్ కోసమే ఆమెను ఉపయోగించారనే వాదనపై ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న జాన్వీ, ఎట్టకేలకు ‘కాఫీ విత్ కరణ్’ టాక్‌షోలో నోరు విప్పడం ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌తో పాటు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
సినిమా విడుదలైన సమయంలో ఈ వివాదంపై మిగతా సెలబ్రిటీలు స్పందించినా జాన్వీ మాత్రం సైలెంట్‌గా ఉంది. అయితే తాజాగా కరణ్ జోహార్ షోలో పాల్గొన్న ఆమె, పెద్ది చిత్రంలో తన పాత్రపై ఓపెన్ అవుతూ ఆసక్తికర విషయాలు పంచుకుంది. సినిమాలో నా పాత్రను మితిమీరిన లైంగిక కోణంలో చూపించడం, అది మహిళలపై చూపే ప్రతికూల ప్రభావం నన్ను ఎంతగానో కలచివేసింది. ఈ వివాదంలో జరిగిన దానికి సగం బాధ్యత నాదే. షూటింగ్ సమయంలోనే నేను మరింత గట్టిగా ప్రశ్నించి ఉండాల్సింది లేదా నో చెప్పాల్సింది.
సాధారణంగా దక్షిణాది సినిమాల్లో కెమెరా యాంగిల్స్, పూర్తి స్థాయి సన్నివేశాల వివరాలు ముందే స్క్రిప్ట్‌లో స్పష్టంగా ఉండవు. పరిశ్రమలో నాకు లభించిన గుర్తింపు, పలుకుబడిని ఉపయోగించి ఆ పరిస్థితిని మార్చాల్సింది. ముందే స్క్రిప్ట్‌ను క్లియర్‌గా తెలుసుకుని ఉండాల్సింది. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తపడతాను అని ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది.
జాన్వీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవ్వడంతో సోషల్ మీడియాలోనూ, సినీ వర్గాల్లోనూ భిన్న రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమా విడుదలయ్యి వివాదం సద్దుమణిగిన కొన్ని నెలల తర్వాత మళ్లీ కరణ్ జోహార్ షోలో ఈ అంశాన్ని తెరపైకి తేవడం ఎంతవరకు సమంజసమని కొందరు విమర్శిస్తున్నారు. చిత్రీకరణ సమయంలో మౌనంగా ఉండి, ఇప్పుడు పశ్చాత్తాపం వ్యక్తం చేయడం పబ్లిసిటీ గిమ్మిక్ మాత్రమేనా అని ప్రశ్నిస్తున్నారు.
బాలీవుడ్ లేదా రీజనల్ సినిమాల్లో అంతకంటే బోల్డ్, గ్లామరస్ సన్నివేశాలు ఉన్న చిత్రాలు ఎన్నో వచ్చినా లేని వివాదం.. కేవలం ‘పెద్ది’ ప్రాజెక్ట్ విషయంలోనే ఎందుకు ఇంత రచ్చ అవుతోందని అభిమానులు, కొందరు విశ్లేషకులు నిలదీస్తున్నారు.ఇంకొందరు మాత్రం జాన్వీ వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు. ఎంత పెద్ద స్టార్ కిడ్ లేదా నటి అయినా, సెట్‌లో కెమెరా యాంగిల్స్ లేదా స్క్రిప్ట్ లోపాలను ప్రశ్నించే స్వేచ్ఛ నటీనటులకు ఉండాలని, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రీ-ప్రొడక్షన్ లెవల్లోనే ప్రతీ సీన్‌పై స్పష్టత ఇచ్చే సంస్కృతి పెరగాలని కోరుతున్నారు.
జాన్వీ కపూర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఒకవైపు 'పెద్ది' బృందానికి, దర్శకుడు బుచ్చిబాబుకు ఇబ్బందికరంగా మారినప్పటికీ.. రాబోయే రోజుల్లో హీరోయిన్ల క్యారెక్టరైజేషన్, స్క్రిప్ట్ సెలెక్షన్ విషయంలో నటీనటులు ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలిపేలా ఒక పెద్ద చర్చకు దారితీశాయనడంలో సందేహం లేదు.




