Jani Master: బహిష్కరణ వేటు ఎత్తివేత.. వివాదానికి శుభం కార్డ్!
Jani Master: తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం సుఖాంతమైంది.
Jani Master: బహిష్కరణ వేటు ఎత్తివేత.. వివాదానికి శుభం కార్డ్!
Jani Master: జానీ మాస్టర్ , డాన్సర్స్ ప్రెసిడెంట్ సుమలత తో సుధీర్భంగా చర్చలు జరిపిన ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ వల్లభనేని , డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి సాయి రాజేష్,ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి చదలవాడ శ్రీనివాసరావు ,ప్రసన్నకుమార్
మీడియా సమావేశంలో అనిల్ వల్లభనేని మాట్లాడుతూ, డాన్సర్స్ అసోసియేషన్ లో ఇటీవల్ కొన్ని ఘటనలు జరిగాయి, జానీ మాస్టర్ వర్సెస్ యూనియన్ డాన్సర్స్ మధ్య జరిగిన విషయాల పై వారు వివరణ ఇచ్చారు, ఆయన పై ఫెడరేషన్ తీసుకున్న శాశ్వత బహిష్కరణ ను వెనుకకు తీసుకుంటున్నాము, జానీ మాస్టర్ , సుమలత ఇచ్చిన వివరణ తో ఫెడరేషన్ సంతృప్తి చెందింది .
26 న డాన్సర్స్ అసోసియేషన్ జనరల్ బాడీలో రాజీనామాలు చేసిన వాళ్ళు అందరూ కలసి కట్టుగా ముందుకు వెళ్తారు , చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ , ఒక ఇంటిలో చిన్న చిన్న గొడవలు అవి అన్ని ఈరోజు పరిష్కారం అయ్యాయి డాన్సర్స్ అసోసియేషన్ అందరూ కలసి కట్టుగా ముందుకు వెళ్తారు.
బాలకృష్ణ గారు ప్రత్యేకించి ఈ సమస్య పరిష్కారం కోసం మాతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్నారు చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ, బాలకృష్ణ గారు కాకినాడ నుంచి కాల్ చేసి సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి వాతావరణం ఉండకూడదు అని సమస్యను పరిష్కరించమని చెప్పారు.
డాన్సర్స్ ఇరువర్గాలు చాలా మంచి వారే, ఎంతో కష్టపడి పనిచేస్టారు ఇంతటి తో సమస్య పరిష్కారం అయ్యింది.




