Jani Master: జానీ మాస్టర్‌కి మరో బిగ్ షాక్..!
Jani Master: టాలీవుడ్‌లో తాజా వివాదాలపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్ అత్యవసర భేటీ.
Jani Master: జానీ మాస్టర్‌కి మరో బిగ్ షాక్..!
Jani Master Suspension: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు మరియు తాజా వివాదాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ అత్యవసరంగా సమావేశమైంది. పరిశ్రమలో క్రమశిక్షణను కాపాడటమే ధ్యేయంగా కౌన్సిల్ సభ్యులు తీసుకున్న ఈ నిర్ణయాలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారంపై జరిగిన చర్చలో భాగంగా, ఆయనపై గతంలో విధించిన సస్పెన్షన్ ఎలాంటి మార్పు లేకుండా యథాతథంగా కొనసాగుతుందని ఫెడరేషన్ స్పష్టం చేసింది. గతంలో జానీ మాస్టర్ ఫెడరేషన్‌కు అందజేసిన రూ. 3 లక్షల మొత్తాన్ని తిరిగి ఆయనకే వెనక్కి పంపుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత వ్యవహార శైలిపై కౌన్సిల్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం నెలకొన్న వివాదాలరీత్యా, డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు మినహా పరిశ్రమలోని మిగిలిన 24 శాఖల సంఘాలకు ఫెడరేషన్ పూర్తి మద్దతు ఉంటుందని తేల్చిచెప్పారు.
చిత్ర పరిశ్రమలో నిబంధనలను ఉల్లంఘించే వారిని, క్రమశిక్షణ తప్పుమనే చర్యలను ఏమాత్రం సహించేది లేదని ఫెడరేషన్ నాయకత్వం హెచ్చరించింది. కార్మికుల హక్కుల పరిరక్షణకు తాము ఎప్పుడూ కట్టుబడి ఉంటామని పునరుద్ఘాటించారు. పరిశ్రమలో శాంతిభద్రతలు, కార్మికుల సంక్షేమం, క్రమశిక్షణే ప్రధాన ప్రాతిపదికగా ఫిల్మ్ ఫెడరేషన్ తీసుకున్న ఈ తాజా నిర్ణయాలు టాలీవుడ్‌లో ఎలాంటి మార్పులకు నాంది పలుకుతాయో వేచి చూడాలి.




