NTR Team: ఆ సంస్థకు, మాకు అస్సలు సంబంధం లేదు.. ఎన్టీఆర్ టీమ్ సంచలన ప్రకటన!

NTR Team: 'RAW NTR' సంస్థతో తమకు ఎలాంటి సంబంధం లేదని యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం స్పష్టం చేసింది.

Arun Chilukuri
Published on: 14 July 2026 3:12 PM IST
NTR Team
X

NTR Team: ఆ సంస్థకు, మాకు అస్సలు సంబంధం లేదు.. ఎన్టీఆర్ టీమ్ సంచలన ప్రకటన!

NTR Team: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) పేరుతో సాగుతున్న కొన్ని అనధికారిక కార్యకలాపాలపై ఆయన వ్యక్తిగత కార్యాలయం (NTR Office) స్పందించింది. ఇటీవల సోషల్ మీడియా మరియు ప్రజల్లో చర్చనీయాంశంగా మారిన 'RAW NTR' అనే సంస్థకు, ఎన్టీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదంటూ ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఈ మేరకు తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని అభిమానులకు, ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

ఎన్టీఆర్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలోని ప్రధానాంశాలు ఇవే.. 'RAW NTR' పేరుతో కొందరు వ్యక్తులు నిర్వహిస్తున్న వివిధ రకాల కార్యకలాపాలు తమ దృష్టికి వచ్చాయని ఎన్టీఆర్ టీమ్ తెలిపింది. ఆ సంస్థకు గానీ, వారు చేసే పనులకు గానీ హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఎన్టీఆర్‌తో ఆ సంస్థకు నేరుగా సంబంధం ఉన్నట్లుగా ప్రజల్లో ఒక తప్పుడు భావన కలిగించేలా వారి వ్యవహారశైలి ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్టీఆర్ తరఫున ఎక్కడైనా ప్రాతినిధ్యం వహించే గానీ, ఆయన పేరును ఉపయోగించే హక్కు గానీ ఆ సంస్థకు అస్సలు లేదని తేల్చి చెప్పింది.

ఎన్టీఆర్ చేపట్టే సేవా కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పనులకు సంబంధించిన ప్రతి విషయాన్ని కేవలం ఆయన అధికారిక పీఆర్ టీమ్ (Official Team) మాత్రమే అధికారికంగా వెల్లడిస్తుందని కార్యాలయం తెలిపింది.

"అనధికారిక వ్యక్తులు, సంస్థల ద్వారా జరిగే ఎలాంటి ప్రచారాలను లేదా సామాజిక సేవా కార్యక్రమాల ప్రకటనలను అభిమానులు, ప్రజలు పరిగణనలోకి తీసుకోవద్దు. ఈ స్పష్టీకరణతో 'RAW NTR'కు సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న అన్ని అపోహలు, వదంతులు, ఊహగానాలకు ముగింపు పడుతుందని ఆశిస్తున్నాం" అని ఎన్టీఆర్ కార్యాలయం తమ ప్రకటనలో పేర్కొంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story