Junior NTR: టాలీవుడ్‌కు ఏమైంది..ఒకరి తర్వాత ఒకరు..!
Junior NTR: గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కుడి భుజానికి కిమ్స్ ఆసుపత్రిలో సర్జరీ జరగనుంది. ప్రశాంత్ నీల్ 'డ్రాగన్' షూటింగ్ వాయిదా.
Junior NTR: టాలీవుడ్‌కు ఏమైంది..ఒకరి తర్వాత ఒకరు..!
NTR shoulder surgery: టాలీవుడ్‌లో వరుస గాయాలు సినీ వర్గాలను, అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే పలువురు అగ్ర హీరోలు షూటింగ్స్‌లో గాయపడగా, తాజాగా గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కూడా గాయం బారిన పడ్డారు. గత కొంతకాలంగా తీవ్ర భుజం నొప్పితో బాధపడుతున్న ఆయన, వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేరారు. హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో కుడి భుజానికి సర్జరీ చేస్తారు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'డ్రాగన్' చిత్రంలో నటిస్తున్నారు. వైద్యుల సూచన మేరకు ఎన్టీఆర్ ప్రస్తుతం షూటింగ్‌లకు దూరంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సర్జరీ అనంతరం ఆయన వైద్యుల సూచన మేరకు కొద్ది వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల 'డ్రాగన్' తదుపరి షూటింగ్ షెడ్యూల్స్ కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఇటీవలి కాలంలో టాలీవుడ్ స్టార్ హీరోలు వరుసగా గాయాలపాలవుతుండటం సంచలనంగా మారింది. పవన్ కల్యాణ్,రామ్ చరణ్,నందమూరి బాలకృష్ణ,వరుణ్ తేజ్, ఇలా పలువురు ప్రముఖ హీరోలు వేర్వేరు చిత్రాల యాక్షన్ సీక్వెన్స్‌లలో గాయపడి, సర్జరీలు మరియు వైద్య చికిత్సలు పొందారు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా సర్జరీ చేయించుకోవాల్సి రావడంతో నందమూరి అభిమానులు, సినీ ప్రేక్షకులు ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా ప్రార్థిస్తున్నారు. అన్న త్వరగా కోలుకుని, మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో బాక్సాఫీస్ వద్ద తన సంచలనాలను రిపీట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.




