Kalki 2: ‘కల్కి 2’లో దీపికా పదుకొణెకు రీప్లేస్మెంట్ లేదు .. రూమర్స్‌కు నాగ్ అశ్విన్ చెక్!
Kalki 2: ‘కల్కి 2’లో దీపికా పదుకొణె స్థానంలో వేరే నటి నటిస్తుందంటూ వస్తున్న రూమర్స్‌పై దర్శకుడు నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చారు.
Kalki 2: ‘కల్కి 2’లో దీపికా పదుకొణెకు రీప్లేస్మెంట్ లేదు .. రూమర్స్‌కు నాగ్ అశ్విన్ చెక్!
Kalki 2: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘కల్కి 2898 AD’. టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ విజువల్ వండర్‌ను వైజయంతీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అశ్వనీ దత్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె వంటి దిగ్గజ నటుల తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రంలో కథ మొత్తం దీపికా పదుకొణె పాత్ర చుట్టూనే తిరిగింది. సినిమా విజయంలోనూ ఆమె పాత్ర కీలకమైంది.
'కల్కి 2'లో దీపికా పదుకొణెను తొలగించారని, ఆమె స్థానంలో సాయి పల్లవి లేదా ఆలియా భట్ నటిస్తున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఈ పుకార్లపై స్వయంగా దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించి అసలు నిజమేంటో బయటపెట్టారు. సీక్వెల్‌లో వేరే నటితో ఆ పాత్రను భర్తీ చేయడం లేదని, అక్కడితో ఆ పాత్రను ముగిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
మొదటి భాగంలో ప్రధాన హైలైట్‌గా నిలిచిన దీపికా పదుకొణె పాత్ర సీక్వెల్‌లో కనిపించకపోయినప్పటికీ, ఆ స్థానాన్ని వేరే నటితో భర్తీ చేయట్లేదని మేకర్స్ స్పష్టం చేయడంతో అన్ని ఊహాగానాలకు తెరపడింది. కథ డిమాండ్ మేరకు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా, ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో రాబోతున్న ‘కల్కి’ సీక్వెల్పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ నుంచి రాబోయే తదుపరి అప్‌డేట్స్ కోసం బాక్సాఫీస్ వర్గాలు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా




