విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ‘కళ్యాణం కమనీయం జీవితం’ పోస్టర్ లాంచ్!

Kalyanam Kamaneeyam: వివిఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై ఖాన్ దురాని, సాహితి ఆవంచ హీరో హీరోయిన్లుగా రవి లోకిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరికొత్త చిత్రం ‘కళ్యాణం కమనీయం జీవితం’.

Arun Chilukuri
Published on: 28 Jun 2026 4:32 PM IST
Kalyanam Kamaneeyam:
X

విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ‘కళ్యాణం కమనీయం జీవితం’ పోస్టర్ లాంచ్!

Kalyanam Kamaneeyam: వివిఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై ఖాన్ దురాని, సాహితి ఆవంచ హీరో హీరోయిన్లుగా రవి లోకిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరికొత్త చిత్రం ‘కళ్యాణం కమనీయం జీవితం’. పైలా ప్రసాద్ రావు, కిషోర్ గుండాల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ స్టార్ రైటర్, రాజ్యసభ సభ్యులు కె.విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ రాజవంశీ రిలీజ్ చేస్తున్నారు.

ఫస్ట్ లుక్ పోస్టర్‌ను లాంచ్ చేసిన అనంతరం ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. "ఈ సినిమా టైటిల్ చాలా బాగుంది. డిస్ట్రిబ్యూటర్ రాజవంశీ నాకు ఈ టైటిల్ గురించి చెప్పగానే చాలా ఇంప్రెస్ అయ్యాను. నిర్మాతలు మంచి ప్రయత్నం చేశారు. పోస్టర్ చూస్తుంటేనే డైరెక్టర్ విజన్ ఏంటో అర్థమవుతోంది. హీరో హీరోయిన్లకు, సినిమా టీమ్ మొత్తానికి నా ఆల్ ది బెస్ట్" అని తెలిపారు.

నిర్మాత పైలా ప్రసాద్ రావు మాట్లాడుతూ.. "మేము అడగగానే విజయేంద్ర ప్రసాద్ గారు వచ్చి మా సినిమా పోస్టర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయనకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. దర్శకుడు రవి నాకు కథ చెప్పగానే.. ఇది తప్పకుండా చేయాల్సిన సినిమా అనిపించింది. ఆయన కథను ఎంత అద్భుతంగా చెప్పాడో, స్క్రీన్‌పై కూడా అంతే బాగా తీశాడు. సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది" అన్నారు.

మరో నిర్మాత కిషోర్ గుండాల మాట్లాడుతూ.. "పాన్ వరల్డ్ స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ గారు పోస్టర్ లాంచ్ చేసి మా టీమ్‌ను బ్లెస్ చేయడం ఒక పెద్ద సక్సెస్‌లా భావిస్తున్నాం. మంచి కథ, ఆకట్టుకునే కథనాలతో ఈ సినిమాను తెరకెక్కించాం. త్వరలోనే ప్రేక్షకులను థియేటర్లలో అలరించేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అని పేర్కొన్నారు.

చిత్ర దర్శకుడు రవి లోకిరెడ్డి మాట్లాడుతూ.. "విజయేంద్ర ప్రసాద్ గారు మా పోస్టర్ ఆవిష్కరించడంతోనే సినిమా సగం సక్సెస్ అయినంత హ్యాపీగా ఉంది. నా కథను నమ్మి, నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ చిత్రం ప్రేమ, సస్పెన్స్ కలయికతో సాగుతూ ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టేలా ఉత్కంఠభరితంగా ఉంటుంది. మా టీమ్ అంతా కలిసి ఒక మంచి ప్రయత్నం చేశాం, ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం" అని ముగించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story