Kangana Ranaut: చిరాగ్ పాశ్వాన్‌తో పెళ్లి వార్తలపై కంగనా క్లారిటీ..!

Kangana Ranaut: కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌తో పెళ్లి వార్తలపై ఎంపీ కంగనా రనౌత్ ఘాటుగా స్పందించారు. తమ మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు.

Arun Chilukuri
Published on: 17 April 2026 11:47 AM IST
Kangana Ranaut
X

Kangana Ranaut: చిరాగ్ పాశ్వాన్‌తో పెళ్లి వార్తలపై కంగనా క్లారిటీ..!

Kangana Ranaut: గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన కంగనా రనౌత్ - చిరాగ్ పాశ్వాన్ పెళ్లి వార్తలపై ఎట్టకేలకు కంగనా స్పందించారు. వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందన్న వార్తలను ఆమె పూర్తిగా కొట్టిపారేశారు. చిరాగ్ పాశ్వాన్‌తో ఉన్న సంబంధంపై కంగనా స్పష్టతనిస్తూ ఇలా వ్యాఖ్యానించారు. "చిరాగ్ నాకు చాలా కాలంగా తెలుసు. అతను నాకు అత్యంత సన్నిహిత మిత్రుడు. మా మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే, అంతకు మించి ఎలాంటి ప్రేమ కానీ, రొమాన్స్ కానీ లేవు" అని తేల్చి చెప్పారు.

"మా మధ్య నిజంగానే ప్రేమ ఉండి ఉంటే.. ఈ పాటికి మాకు పెళ్లి అయ్యి పిల్లలు కూడా ఉండేవారు. ఇన్నేళ్లుగా మా బంధంలో ఎలాంటి మార్పు రాలేదు, అది ఎప్పటికీ స్నేహంగానే ఉంటుంది" అంటూ రూమర్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు.

సినిమా నుంచి పార్లమెంట్ దాకా..

వీరిద్దరి ప్రయాణం 2011లో మొదలైంది. 2011లో విడుదలైన ఈ సినిమాలో కంగనా, చిరాగ్ జంటగా నటించారు. ఆ తర్వాత చిరాగ్ రాజకీయాల్లోకి వెళ్లగా, కంగనా స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. ప్రస్తుతం వీరిద్దరూ ఎంపీలుగా పార్లమెంట్‌లో కొనసాగుతున్నారు. ఇటీవల పార్లమెంట్ ఆవరణలో వీరిద్దరూ నవ్వుతూ పలకరించుకున్న వీడియోలు, ఫోటోలు వైరల్ కావడంతో ఈ పెళ్లి రూమర్లు మళ్ళీ తెరపైకి వచ్చాయి. కంగనా తాజాగా ఇచ్చిన క్లారిటీతో ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పడినట్లయింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story