Ravibabu: హిందీలోకి రవిబాబు ఎంట్రీ.. కంగనాతో 'స్కేరీ పిక్చర్'!

Ravibabu: కంగనా రనౌత్, రవిబాబు కాంబోలో హారర్ మూవీ 'స్కేరీ పిక్చర్', రానా దగ్గుబాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

Ravi
By Ravi
Published on: 2 Nov 2026 5:27 PM IST
Ravibabu
X

Ravibabu: హిందీలోకి రవిబాబు ఎంట్రీ.. కంగనాతో 'స్కేరీ పిక్చర్'!

Ravibabu: బాలీవుడ్ నటి కంగనా రనౌత్, టాలీవుడ్ డైరెక్టర్ రవిబాబు కాంబోలో మూవీ తెరకెక్కనుంది. ఈ హారర్ సినిమాకు 'స్కేరీ పిక్చర్'గా పేరు పెట్టారు. హీరో రానా దగ్గుబాటి నిర్మాతగా వ్యవహరించనున్నారు. హాలోవీన్ రోజైన అక్టోబర్ 31న ఢిల్లీలో జరిగిన హారర్‌కాన్ ఇండియా 2026 వేదికగా టైటిల్‌ను రానా ప్రకటించారు. ఈ మూవీతో రవిబాబు తొలిసారి హిందీ పరిశ్రమలో అడుగుపెట్టనున్నారు.

కంగనా ఆదివారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ప్రకటన వీడియోను షేర్ చేసి సినిమాలో తన భాగస్వామ్యాన్ని ధ్రువీకరించారు. ఇది హిందీ, తెలుగు భాషల్లో తెరకెక్కే ద్విభాషా చిత్రమని సమాచారం. కంగనా ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లోని మండి ఎంపీగా కూడా కొనసాగుతున్నారు. 2009లో వచ్చిన 'రాజ్: ది మిస్టరీ కంటిన్యూస్' తర్వాత ఆమె మళ్లీ హారర్ జానర్‌కు రావడం ఇదే.

సినిమా రిలీజ్ డేట్, ఇతర నటీనటుల వివరాలను మేకర్స్ ఇంకా వెల్లడించలేదు. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే దానిపై కూడా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.