విజయ్ దేవరకొండతో స్టెప్పులేయనున్న ‘కన్నప్ప’ బ్యూటీ!

Vijay Deverakonda: టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, టాలెంటెడ్ డైరెక్టర్ రవి కిరణ్‌ కోలా కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవేటెడ్ రూరల్ యాక్షన్ డ్రామా ‘రౌడీ జనార్దన’.

Srinivas Rao
Published on: 24 May 2026 1:57 PM IST
Vijay Deverakonda
X

విజయ్ దేవరకొండతో స్టెప్పులేయనున్న ‘కన్నప్ప’ బ్యూటీ!

Vijay Deverakonda: టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, టాలెంటెడ్ డైరెక్టర్ రవి కిరణ్‌ కోలా కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవేటెడ్ రూరల్ యాక్షన్ డ్రామా ‘రౌడీ జనార్దన’. ఈ సినిమాకు సంబంధించిన రోజుకో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తాజాగా ఈ ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ఒక భారీ ఐటెం సాంగ్‌ను ప్లాన్ చేసినట్లు, అందులో విజయ్ సరసన నర్తించేందుకు ఒక క్రేజీ బ్యూటీని ఎంపిక చేసినట్లు ఫిల్మ్‌నగర్ వర్గాల్లో గట్టి టాక్ వినిపిస్తోంది.

విజయ్ దేవరకొండ సరసన ప్రీతి ముకుందన్

ఈ మాస్ మసాలా స్పెషల్ సాంగ్‌లో విజయ్ దేవరకొండతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి యంగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. మంచు విష్ణు ప్రతిష్టాత్మక చిత్రం ‘కన్నప్ప’తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు రౌడీ హీరోతో కలిసి స్పెషల్ నంబర్‌లో మెరిసే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకుందని సమాచారం. మాస్ ఆడియన్స్‌ను ఊపేసేలా ఉండే ఈ పాటలో విజయ్, ప్రీతిల కెమిస్ట్రీ , డ్యాన్స్ మూవ్స్ థియేటర్లలో ప్రధాన ఆకర్షణగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఫుల్ యాక్షన్ మోడ్‌లో ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్

ఈ సినిమా కథాంశం పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగనుంది. ముఖ్యంగా చిత్రంలో వచ్చే ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ సినిమా మొత్తానికే హైలైట్‌గా నిలుస్తాయని సమాచారం. ఈ ప్లాష్ బ్యాక్ సీన్స్‌లో విజయ్ దేవరకొండ మునుపెన్నడూ లేని విధంగా అత్యంత పవర్‌ఫుల్ యాక్షన్ మోడ్‌లో కనిపిస్తాడట. ఇందులో వచ్చే హై-వోల్టేజ్ స్టంట్ సీక్వెన్స్ మాస్ ప్రేక్షకులకు నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తాయని చిత్ర యూనిట్ ఎంతో ధీమాగా ఉంది.

ఊహించని లుక్‌లో సీనియర్ హీరో రాజశేఖర్

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేశ్‌ కథానాయికగా నటిస్తుండటంతో అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని తాకాయి. వీటన్నింటితో పాటు, ఈ చిత్రంలో సీనియర్ యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ ఒక కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రాజశేఖర్ క్యారెక్టర్ డిజైన్ , ఆయన లుక్ మునుపెన్నడూ చూడని రీతిలో ఎంతో వైవిధ్యంగా, పవర్‌ఫుల్‌గా ఉంటుందని టాక్. మొత్తానికి భారీ తారాగణం, విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ‘రౌడీ జనార్దన’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Srinivas Rao

Srinivas Rao

శ్రీనివాస్ రావు జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలు అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏపీ7 ఏఎంలో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విశ్లేషణాత్మక దృక్పథంతో వార్తలకు కొత్త కోణాన్ని జోడిస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

Next Story