Karthi: హీరోయిన్‌కు అలాంటి బట్టలు వేస్తారా..? వివాదంలో చిక్కుకున్న కార్తీ!
Karthi: ‘సర్దార్-2’ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్ మాళవిక మోహనన్‌పై హీరో కార్తీ చేసిన గ్లామర్ వ్యాఖ్యలు.
Karthi: హీరోయిన్‌కు అలాంటి బట్టలు వేస్తారా..? వివాదంలో చిక్కుకున్న కార్తీ!
Malavika Mohanan: కోలీవుడ్ వర్సటైల్ హీరో కార్తీ కెరీర్లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘సర్దార్’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘సర్దార్-2’. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అయితే సినిమా విడుదల సమయానికి సరిగ్గా ముందు, ప్రీ-రిలీజ్ ఈవెంట్లో హీరో కార్తీ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఊహించని విధంగా సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపాయి.
ప్రీ-రిలీజ్ వేడుకలో భాగంగా సినిమా విశేషాలను పంచుకుంటూ కార్తీ చిత్రబృందంతో జరిగిన ఒక సరదా సంఘటనను గుర్తు చేసుకున్నారు. సినిమాలో హీరోయిన్గా మాళవిక మోహనన్‌ను ఎంపిక చేసే సమయంలో.. హాలీవుడ్ స్టార్ నటి మోనికా బెల్లూచి తరహాలోనే మాళవికకు కూడా ఈ చిత్రంలో మంచి గ్లామరస్ దుస్తులు ఉంటాయా అని తాను దర్శక నిర్మాతలను సరదాగా అడిగినట్లు స్టేజ్‌పై చెప్పారు. ప్రేక్షకులకు మంచి వినోదం పంచాలనే ఉద్దేశంతోనే ఆ మాటలన్నానని కార్తీ క్లారిటీ ఇచ్చినప్పటికీ, ఆ కామెంట్స్ నెటిజన్లను ఆగ్రహానికి గురిచేశారు.
ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాల్లో మాళవిక మోహనన్ కేవలం గ్లామర్ డాల్‌లా కాకుండా, ఒక పవర్ఫుల్ స్పై ఏజెంట్‌గా, హెవీ యాక్షన్ సీక్వెన్స్‌లు చేస్తూ కనిపించారు. అంతటి ఇంపార్టెంట్ రోల్ చేస్తున్న నటి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆమె పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాల్సింది పోయి గ్లామర్ కోణంలో మాట్లాడటం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. టెక్నికల్ యాక్షన్ సినిమాలలో నటీమణులు కూడా రిస్క్ చేసి కష్టపడుతుంటే, వారిని కేవలం గ్లామర్ కోణంలో మాత్రమే చూసే పాత పద్ధతిని ఒక సీనియర్ హీరో సమర్థించడం సరికాదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కార్తీ సాధారణంగా తన మంచి మనసుతో, ఎవరిని నొప్పించకుండా మాట్లాడే నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన ఏ ఉద్దేశంతో ఆ మాటలన్నప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న తరుణంలో ఈ వివాదం సినిమాపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని ట్రేడ్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఏది ఏమైనా, గ్లామర్ వ్యాఖ్యల వివాదం ప్రస్తుతం ‘సర్దార్-2’ చిత్రానికి అంతులేని పబ్లిసిటీ తెచ్చిపెట్టిందన్నది మాత్రం వాస్తవం.




