Dorothy movie: కీర్తి సురేష్ అడల్ట్ కంటెంట్‌ మూవీపై నెటిజన్ల ఆగ్రహం..సినిమా బ్యాన్ చేయాలని డిమాండ్!

Dorothy movie: కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో కీర్తి సురేష్ నటించిన ‘డోరతీ’ సినిమా వివాదంలో చిక్కుకుంది.

Gagan kumar
Published on: 27 Sept 2026 5:14 PM IST
Dorothy movie
X

Dorothy movie: కీర్తి సురేష్ అడల్ట్ కంటెంట్‌ మూవీపై నెటిజన్ల ఆగ్రహం..సినిమా బ్యాన్ చేయాలని డిమాండ్!

Dorothy movie: కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో, మహానటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘డోరతీ’. రా అండ్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా భారీ అంచనాల మధ్య శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, ప్రస్తుతం బాక్సాఫీస్ వద్దే కాకుండా సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఒకవైపు ప్రశంసలు అందుకుంటున్న ఈ చిత్రం, మరోవైపు అనూహ్యమైన వివాదంలో చిక్కుకుంది.

సినిమా మొదటి భాగం కాస్త నెమ్మదిగా సాగినప్పటికీ, కథాంశం చాలా బలంగా ఉందని ప్రేక్షకులు కొనియాడుతున్నారు. సినిమాలో కీర్తి సురేష్ స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్నప్పటికీ, తన అద్భుతమైన నటనతో ఎంతో ప్రభావం చూపారు. సింగిల్ షాట్ సన్నివేశాలు, ఇంటర్వెల్ బ్లాక్‌లను దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ అత్యంత ప్రతిభావంతంగా తెరకెక్కించారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్రాణం పోసిందని క్రిటిక్స్ ప్రశంసిస్తున్నారు.

ఈ చిత్రంలో LGBTQ అంశాలను తప్పుగా, అసభ్యకరంగా చిత్రీకరించారంటూ నెటిజన్ల నుంచి తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి.ముఖ్యంగా ఇద్దరు పురుషుల మధ్య వచ్చే ముద్దు సన్నివేశం (కిస్ సీన్) ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇందులో హద్దులు దాటిన అడల్ట్ కంటెంట్ ఉందని ప్రేక్షకులు మండిపడుతున్నారు.

ఇలాంటి అంశాలను, అడల్ట్ కంటెంట్‌ను బలవంతంగా సినిమాల్లో చూపడాన్ని తప్పుపడుతూ ఎక్స్ వేదికగా #BoycottDorothy అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.

కార్తీక్ సుబ్బరాజ్ లాంటి పేరున్న ప్రతిష్టాత్మక దర్శకుడి నుంచి ఇలాంటి కంటెంట్‌ను ఊహించలేదంటూ నెటిజన్లు బహిరంగంగానే తమ నిరసన తెలుపుతున్నారు. మరి ఈ వివాదంపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.