Keerthy Suresh: దర్శకుడు అక్కడ టచ్ ... దిమ్మతిరిగేలా సమాధానమిచ్చిన కీర్తి సురేష్..!

Mysskin: ‘సత్యవాన్ సావిత్రి’ ప్రెస్ మీట్‌లో దర్శకుడు మిస్కిన్ ప్రవర్తన పట్ల కీర్తి సురేష్ అసౌకర్యానికి గురయ్యారంటూ వైరల్ అయిన వీడియోపై ఆమె ఘాటుగా స్పందించారు.

Gagan kumar
Published on: 20 Nov 2026 10:25 AM IST
Keerthy Suresh
X

Keerthy Suresh: దర్శకుడు అక్కడ టచ్ ... దిమ్మతిరిగేలా సమాధానమిచ్చిన కీర్తి సురేష్..!

Mysskin: స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్, ప్రముఖ తమిళ దర్శకుడు మిస్కిన్ ప్రధాన పాత్రల్లో నటించిన కోర్ట్ రూమ్ డ్రామా ‘సత్యవాన్ సావిత్రి’. ప్రవీణ్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం (నవంబర్ 20) థియేటర్లలో విడుదలైంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల జరిగిన ప్రెస్ మీట్‌కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. మిస్కిన్ ప్రవర్తన పట్ల కీర్తి అసౌకర్యానికి గురయ్యారంటూ కొందరు ట్రోల్స్ చేయగా, ఓ నెటిజన్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు కీర్తి సురేష్ ఘాటుగా బదులిచ్చారు.

‘సత్యవాన్ సావిత్రి’ ప్రెస్ మీట్‌లో దర్శకుడు మిస్కిన్ మాట్లాడుతూ, కీర్తి సురేష్ నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. గతంలో ఆమె నటించిన ‘డోరతీ’ చిత్రంలో కీర్తి పర్ఫార్మెన్స్ అద్భుతమని, అలాంటి పాత్రలు చేయడానికి ఎంతో ధైర్యం కావాలని అభినందించారు. అంతేకాకుండా, తన అభిమానానికి గుర్తుగా కీర్తికి ఒక బంగారు ఉంగరాన్ని బహుమతిగా అందించారు. అయితే, ఆమెను ప్రశంసిస్తూ మాట్లాడే క్రమంలో మిస్కిన్ ఆప్యాయంగా కీర్తి మోకాలి పైభాగంలో చేయి వేస్తూ కనిపించారు. ఆ క్షణంలో కీర్తి సురేష్ ఇబ్బందిగా ఫీలయ్యారంటూ కొందరు ఆ వీడియో క్లిప్‌ను కట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.

ఈ వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేసిన ఓ నెటిజన్.. సినిమాల్లో హీరోలతో ఎంతో చనువుగా ఉంటారు, ఎక్కడ తాకినా నవ్వుతూనే ఉంటారు కదా.. మరి మిస్కిన్ అలా టచ్ చేసినందుకు మొహం అలా ఎందుకు పెట్టారు? అంతగా ఫీల్ అవుతున్నారేంటి? అంటూ అసభ్యకర రీతిలో ప్రశ్నించాడు. ఈ ట్వీట్ కీర్తి సురేష్ దృష్టికి వెళ్లడంతో ఆమె ఏమాత్రం తగ్గకుండా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తన స్పందనతో సదరు నెటిజన్ నోరు మూయించారు.

మొదటగా.. అసలు నా ముఖంలో మీకు అసౌకర్యం ఎక్కడ కనిపించింది? మేమిద్దరం తండ్రీకూతుళ్లలాంటి అనుబంధాన్ని పంచుకుంటామని ఆయనగానీ, నేనుగానీ చెప్పడం మీరు వినలేదా? రెండో విషయం.. ఒకవేళ నేను నిజంగానే అసౌకర్యంగా ఫీలయ్యానని అనుకుందాం. సినిమాల్లో నటించేటప్పుడు మమ్మల్ని తాకుతుంటారు కాబట్టి, బయట పబ్లిక్‌గా అలా జరిగినప్పుడు కూడా నేను సౌకర్యంగానే ఉండాలని మీరు చెబుతున్నారా? బ్రదర్.. మీరు కొన్ని విషయాలను సరిగ్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని కీర్తి సురేష్ చెప్పుకొచ్చారు.

కీర్తి సురేష్ ఇచ్చిన ఈ సూటి ప్రశ్నలకు సోషల్ మీడియాలో విపరీతమైన మద్దతు లభించింది. నటనకు, నిజ జీవితానికి మధ్య ఉన్న తేడాను, అలాగే ఒక మహిళ వ్యక్తిగత స్పేస్‌ను గౌరవించాల్సిన అవసరాన్ని కీర్తి ఎంతో హుందాగా, అదే సమయంలో ఘాటుగా వివరించారని అభిమానులు కొనియాడుతున్నారు. కీర్తి రిప్లైతో నెటిజన్ల నుండి తీవ్ర విమర్శలు ఎదురవడంతో, ఆ పోస్ట్ పెట్టిన వ్యక్తి తన ట్వీట్‌ను డిలీట్ చేసుకున్నాడు.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.