Prabhas Fauji : ప్రభాస్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్.. 'ఫౌజీ' రిలీజ్ డేట్ వచ్చేసింది.!

Prabhas Fauji : 1990ల కాలం నాటి పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన తెలుగు క్రైమ్ డ్రామా ‘KJQ’ (కింగ్ జాకీ క్వీన్) ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా

G Krishna
Published on: 3 Aug 2026 7:22 AM IST
Fauji-Paradise
X

Fauji-Paradise

Prabhas Fauji : 1990ల కాలం నాటి పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన తెలుగు క్రైమ్ డ్రామా ‘KJQ’ (కింగ్ జాకీ క్వీన్) ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ‘దసరా’ ఫేమ్ దీక్షిత్ శెట్టి, శశి ఓదెల, యుక్తి తరేజా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి కిరణ్ కుమార్ దర్శకత్వం వహించగా, SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. తాజాగా హైదరాబాద్‌లోని హోటల్ అవాసలో నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ వేదికపై ప్రభాస్ నటిస్తున్న 'ఫౌజీ' రిలీజ్ డేట్‌తో పాటు నాని 'ది ప్యారడైజ్' టీజర్ అప్‌డేట్ కూడా రావడంతో సోషల్ మీడియాలో సందడి నెలకొంది.

డిసెంబర్ 2న ప్రభాస్ 'ఫౌజీ' రిలీజ్

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ నిర్మాత మైత్రి రవి మాట్లాడుతూ.. ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘ఫౌజీ’ షూటింగ్ శరవేగంగా జరుగుతోందని తెలిపారు. ఈ సినిమాను డిసెంబర్ 2న ప్రీమియర్స్‌తో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ క్రేజీ అప్‌డేట్‌తో ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

దర్శకుడి కష్టాన్ని గుర్తించాలి: శ్రీకాంత్ ఓదెల

దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో సాధారణ, యావరేజ్ టాక్ వచ్చిన సినిమాలను కూడా ప్రేక్షకులు థియేటర్లలో ఆదరిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఒక సినిమా తీయడం వెనుక దర్శకుడి కష్టం ఎంతో ఉంటుందని, మీడియా, ప్రేక్షకులు ఆ ప్రయత్నాన్ని గుర్తించి పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వాలని కోరారు. అలాగే దర్శకుడు కిరణ్ కుమార్‌లోని మంచి మనసును ప్రశంసిస్తూ, ఆయన వీధి కుక్కలను కూడా ఇంటికి తీసుకెళ్లి పెంచుకునేంత దయాగుణం ఉన్న వ్యక్తి అని కొనియాడారు. ఇదే సమయంలో నాని కథానాయకుడిగా తను తెరకెక్కిస్తున్న 'ది ప్యారడైజ్' చిత్రం టీజర్ ఆగస్టు 6న విడుదల కానుందని, అది ఖచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

విజేత కంటే.. ఓటమి నుంచి నిలబడినవాడే గొప్ప: శశి ఓదెల

హీరో శశి ఓదెల మాట్లాడుతూ దర్శకుడు కిరణ్ ఆలోచనా విధానాన్ని గుర్తుచేసుకున్నారు. దావూద్ ఇబ్రహీం జీవితంలో ఎవరికీ తెలియని ప్రేమ, స్నేహం, భావోద్వేగాల కోణాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నట్లు చెప్పారు. "రోజూ ఉదయాన్నే తొలి సినిమాతోనే రూ.100 కోట్ల హిట్ కొట్టిన మా అన్న శ్రీకాంత్‌ను చూసేవాడిని. అదే సమయంలో తొలి సినిమాతో పరాజయాన్ని చూసిన దర్శకుడు కిరణ్‌ను కూడా చూశాను. కానీ నా దృష్టిలో విజయాన్ని చూసిన వ్యక్తి కంటే, ఓటమి నుంచి మళ్లీ ధైర్యంగా నిలబడిన దర్శకుడే నిజమైన విజేత" అని శశి వ్యాఖ్యానించడం అందరినీ ఆకట్టుకుంది.

ఒకే వేదికపై నుంచి ప్రభాస్ 'ఫౌజీ' విడుదల తేదీ, నాని 'ది ప్యారడైజ్' టీజర్ లీక్ కావడంతో పాటు సినిమా పరిశ్రమపై దర్శకులు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి డిసెంబర్ 2న రాబోతున్న 'ఫౌజీ'పై, ఆగస్టు 6న రానున్న 'ది ప్యారడైజ్' టీజర్‌పైనే నెలకొంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story