Balakrishna: వరుస సినిమాలతో జోరు పెంచిన బాలకృష్ణ.. అక్టోబర్ నుంచి కొరటాల మూవీ స్టార్ట్!

Balakrishna: నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతున్న 'NBK112' సినిమా అక్టోబర్ నుంచి పట్టాలెక్కనుంది. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Ravi
By Ravi
Published on: 4 Aug 2026 7:22 AM IST
Balakrishna
X

Balakrishna: వరుస సినిమాలతో జోరు పెంచిన బాలకృష్ణ.. అక్టోబర్ నుంచి కొరటాల మూవీ స్టార్ట్!

బాలకృష్ణ: టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమాలకు ఉండే క్రేజే వేరు. ఆయనతో సినిమా చేయడానికి ప్రముఖ దర్శకులు ఎప్పుడూ ముందుంటారు. తాజాగా టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ సెట్ అయినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. ఈ కాంబోపై ఇప్పటికే టాలీవుడ్ సర్కిల్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎప్పనుంచి ప్రారంభం కానుంది, దీనికి సంబంధించిన ఇతర వివరాలు ఏమిటనే విషయాలపై తాజాగా కొన్ని ఆసక్తికరమైన వార్తలు బయటకు వచ్చాయి.

నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ కాంబోలో రాబోతున్న 'NBK112' సినిమా అక్టోబర్ నుంచి అఫీషియల్‌గా పట్టాలెక్కనుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి ముందు బాలయ్య కొన్ని ఆరోగ్యపరమైన కారణాల వల్ల విశ్రాంతి తీసుకోవాల్సి వస్తోంది. ఇటీవల గాయపడిన మోకాలికి బాలయ్య విజయవంతంగా సర్జరీ చేయించుకున్నారు. ఈ శస్త్రచికిత్స తర్వాత వైద్యుల సూచన మేరకు ఆయన దాదాపు 6 నుండి 8 వారాల పాటు ఎలాంటి షూటింగ్స్‌లో పాల్గొనకుండా పూర్తిగా రెస్ట్ తీసుకుంటున్నారు.

మోకాలి సర్జరీ నుంచి పూర్తిగా కోలుకున్నాక, అక్టోబర్ నెల నుంచి బాలకృష్ణ వరుస షూటింగ్స్‌తో బిజీ కానున్నారు. అక్టోబర్ నుంచి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న 'NBK111' సినిమాతో పాటు, కొరటాల శివ తెరకెక్కించనున్న 'NBK112' చిత్రాల షూటింగ్స్‌లో ఆయన సమాంతరంగా పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఒకే సమయంలో రెండు భారీ ప్రాజెక్ట్‌లకు సంబంధించిన షూటింగ్ షెడ్యూల్స్‌లో బాలయ్య పాల్గొననుండటం ఆయన అభిమానులకు నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

ఇదిలాఉంటే, ఈ చిత్రానికి సంబంధించి క్యాస్టింగ్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా 'NBK112' చిత్రంలో ఒక అత్యంత కీలకమైన, ప్రాధాన్యత ఉన్న పాత్ర కోసం టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ నటి ఐశ్వర్య రాజేష్‌ను చిత్ర యూనిట్ ఎంపిక చేసినట్లు సమాచారం వినిపిస్తోంది. ఈ వార్త గనుక నిజమైతే బాలయ్య సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తుండటం ఇదే మొదటిసారవుతుంది. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. కొరటాల శివ మార్క్ మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు బాలయ్య బాబు ఎనర్జిటిక్ యాక్షన్ ఈ చిత్రంలో హైలైట్‌గా నిలవనున్నాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story