రామానాయుడు స్టూడియోస్‌లో ‘లఫూట్ గ్యాంగ్’ మూవీ గ్రాండ్ లాంచ్!

Lafoot Gang Movie: ఎల్ఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కొండాపూర్ లక్ష్మీకాంత్ రెడ్డి నిర్మాణంలో, అనురాగ్ అధర్వ రాజు దర్శకత్వంలో సరికొత్త ఫన్ ఎంటర్టైనర్ "లఫూట్ గ్యాంగ్" చిత్రం రామానాయుడు స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 27 May 2026 9:48 PM IST
Lafoot Gang Movie
X

రామానాయుడు స్టూడియోస్‌లో ‘లఫూట్ గ్యాంగ్’ మూవీ గ్రాండ్ లాంచ్!

Lafoot Gang Movie: రామానాయుడు స్టూడియోస్‌లో ఎల్ఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న కొత్త చిత్రం ‘లఫూట్ గ్యాంగ్’ పూజా కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి అనురాగ్ అధర్వ రాజు రచన, దర్శకత్వం వహిస్తుండగా, కొండాపూర్ లక్ష్మీకాంత్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

1990ల నాటి హాస్టల్ నేపథ్యంలో సాగే ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రానికి వర్ధన్ మయూర్ కొయ్యాడ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్ ఆర్ ధృవన్ సంగీతం సమకూరుస్తుండగా, టీసీ ప్రసన్నకుమార్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. వెంకటేష్ అత్తిలి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి దర్శకుడు Pawan సాదినేని, నిర్మాత BVS రవి, నటులు రాజ్ తరుణ్, ఆకాష్ పూరి, అలీ, రాహుల్ విజయ్, నటి దీపశిక, అర్చన అయ్యర్, దర్శక నిర్మాత అనిల్ కడియాల తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ చిత్రానికి నటుడు అలీ క్లాప్ కొట్టగా, పవన్ సాధినేని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. రాజ్ తరుణ్, ఆకాష్ పూరి చేతుల మీదుగా స్క్రిప్ట్ అందించారు.

ఈ సందర్భంగా దర్శకుడు అనురాగ్ అధర్వ రాజు మాట్లాడుతూ, “1990ల కాలం నేపథ్యంలో సాగే ఈ కథ ప్రేక్షకులను కొత్తగా అలరిస్తుంది. ఎన్నో కథలు వచ్చినా ఈ చిత్రం ప్రత్యేకంగా నిలుస్తుంది” అని తెలిపారు.

నిర్మాత కొండాపూర్ లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, “మా సినిమా ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ప్రేక్షకుల ఆశీర్వాదాలతో ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నాం” అన్నారు.

సంగీత దర్శకుడు ఆర్ ఆర్ ధృవన్ మాట్లాడుతూ, “ఈ కథ చాలా ప్రత్యేకంగా అనిపించింది. ఈ చిత్రంలోని పాటలు, అప్డేట్స్ ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇస్తాయి” అని అన్నారు.

డీఓపీ వర్ధన్ "ఈ చిత్ర కథ చాలా బాగుంది. థియేటర్ కి వచ్చి అందరూ ఎంజాయ్ చేసే విధంగా ఈ సినిమా ఉంటుంది. తప్పకుండా ప్రేక్షకులు ఎంటర్టైన్ అవుతారు" అన్నారు.

నటుడు రాకీ మాట్లాడుతూ.. "ఈ కథ విన్నప్పటి నుండి అనురాగ్ గారితో కలిసి ప్రయాణం చేస్తున్నాను. ఇప్పటికి ఆ టైన్ జోన్ లో ఎన్నో కథలు వచ్చినప్పటికీ ఈ సినిమా కథ మరింత కొత్తగా ఉంటుంది. ఈ చిత్రం కచ్చితంగా అందరినీ ఎంటర్టైన్ చేసే విధంగా ఉంటుంది" అన్నారు.

నటుడు అభినవ్ మాట్లాడుతూ.. "మా చిత్ర ప్రారంభ కార్యక్రమానికి వచ్చి సక్సెస్ చేసినందుకు మీడియా అందరికీ థాంక్స్. ఈ సినిమా ద్వారా ప్రేక్షకులు బాగా వినోదం పొందుతారు" అన్నారు.

నటుడు అంటోనీ కార్తీక్ మాట్లాడుతూ.. "ఈ సినిమా జాతి రత్నాలు తరహా చిత్రంలా అందరికీ గుర్తుండిపోతుంది. కొత్త టాలెంట్ ను ప్రోత్సహిస్తూ వస్తున్న ఈ చిత్రం ఫుల్ ఎంటర్టైనర్ గా నిలుస్తుంది" అన్నారు.

నటుడు రిత్విక్ మాట్లాడుతూ.. "ఈ సినిమా పేరు మాస్ గా ఉంటుంది కాని మంచి సినిమా. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలుస్తుంది. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్" అన్నారు.

నటుడు నందు మాట్లాడుతూ.. "ఈ సినిమా ఫన్నీ & ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలుస్తుంది. ప్రేక్షకులు అందరూ కుటుంబాలతో కలిసికట్టుగా చూసే విధంగా ఉండబోతుంది" అన్నారు.

ఎక్స్కుటివ్ నిర్మాత వెంకటేష్ అత్తిలి మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. మా చిత్ర ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయం పొందేలా చేసిన మీడియా వారికి నా థాంక్స్. వచ్చే నెలలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కాబోతుంది. సినిమా మంచి విజయం పొందుతుందని ఆశిస్తున్నాను" అన్నారు.

1990ల నాటి ఒక హాస్టల్ లో జరిగే కథగా ఈ చిత్రం తెరకెక్కనుంది. అల్లరి చిల్లరిగా ఉండే ఒక యువకుల గ్యాంగ్ హాస్టల్లో ఎలా ఉంటారు, అలాగే వారి హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుంది అనే కథనాలతో ఈ సినిమా ఉండబోతుంది. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల వివరాలు చిత్ర బృందం త్వరలోనే తెలియచేస్తామని తెలిపారు. అలాగే సినిమాకు సంబంధించిన షూటింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీడియా ద్వారా తెలియజేస్తామని అన్నారు.

నటీనటులు: రాఖి, రిత్విక్, అభినవ్, నందు, ఆంటోనీ కార్తిక్ తదితరులు.

సాంకేతిక బృందం:

బ్యానర్: ఎల్ఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్స్

నిర్మాత: కొండాపూర్ లక్ష్మీకాంత్ రెడ్డి

రచన దర్శకత్వం: అనురాగ్ అధర్వ రాజు

డిఓపి: వర్ధన్ మయూర్ కొయ్యాడ

ఎడిటర్: టిసి ప్రసన్నకుమార్

సంగీతం: ఆర్ ఆర్ ధృవన్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకటేష్ అత్తిలి

రైటర్స్: శ్రీనివాస్ కంటైపాలెం, రాంబాబు కుశ

కొరియోగ్రాఫర్: విజయ్ పోలకి

ప్రొడక్షన్ డిజైనర్: వినయ్ వర్మ

హార్ట్ డైరెక్టర్: గాంధీ నడికుడికర్

డిజిటల్ మార్కెటింగ్: చిత్త్రగ్రాహిణి మీడియా

పిఆర్ఓ: హేమ మాలిని

పబ్లిసిటీ: సంతోష్ చెర్రీ

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story