Prakash Raj: ప్రకాశ్ రాజ్‌కు లీగల్ నోటీసులు.. బహిరంగ క్షమాపణకు డిమాండ్..!
Prakash Raj: ప్రకాశ్ రాజ్‌కు రూ. 100 కోట్ల పరువు నష్టం నోటీసు. రామలక్ష్మణులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి లీగల్ నోటీసులు జారీ చేశారు.
Prakash Raj: ప్రకాశ్ రాజ్‌కు లీగల్ నోటీసులు.. బహిరంగ క్షమాపణకు డిమాండ్..!
Legal Notice to Prakash Raj: విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు. హిందువుల ఆరాధ్య దైవాలైన రామలక్ష్మణులపై ఆయన చేసిన వ్యాఖ్యలు కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశాయంటూ టీటీడీ (TTD) బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన న్యాయవాది ద్వారా ప్రకాశ్ రాజ్‌కు లీగల్ నోటీసులు పంపారు.
రామలక్ష్మణుల గురించి ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా ఉన్నాయని, సమాజంలో విద్వేషాలను ప్రేరేపించేలా ఉన్నాయని భానుప్రకాశ్ రెడ్డి నోటీసులో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలకు గానూ ప్రకాశ్ రాజ్ తక్షణమే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవేళ నిర్ణీత గడువులోగా స్పందించకపోతే, రూ. 100 కోట్లకు పరువు నష్టం దావా వేయడంతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గతంలో తిరుమల లడ్డూ కల్తీ వివాదం సమయంలోనూ ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్లు మరియు వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారం రేపాయి. అప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో సహా పలువురు నేతలు ఆయనపై మండిపడ్డారు. ఆ వివాదం సర్దుమణుగుతోంది అనుకుంటున్న తరుణంలోనే, మళ్ళీ దేవతామూర్తులపై వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో నోటీసులు రావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ నోటీసులపై ప్రకాశ్ రాజ్ ఏ విధంగా స్పందిస్తారన్నది ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.




