Deva: ‘తొలిప్రేమ’, ‘బాషా’, ‘మాస్టర్’ చిత్రాల స్వరకర్త ఇకలేరు: సంగీత దర్శకుడు దేవా ఆకస్మిక మృతి!

Deva: ప్రముఖ సంగీత దర్శకుడు దేవా (75) గుండెపోటుతో కన్నుమూశారు. 'తొలిప్రేమ', 'మాస్టర్', 'బాషా' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు స్వరాలు అందించిన దేవా ప్రస్థానం.

Arun Chilukuri
Published on: 17 Oct 2026 12:33 PM IST
Deva
X

Deva: ‘తొలిప్రేమ’, ‘బాషా’, ‘మాస్టర్’ చిత్రాల స్వరకర్త ఇకలేరు: సంగీత దర్శకుడు దేవా ఆకస్మిక మృతి!

Deva: భారతీయ చిత్రపరిశ్రమలో, ముఖ్యంగా దక్షిణాది సినిమా రంగాన తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో వందలాది సూపర్ హిట్ స్వరాలను అందించిన ప్రముఖ స్వరకర్త, 'గానా కింగ్' దేవా (75) గుండెపోటుతో కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసు పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.

దాదాపు 400 సినిమాలకు సంగీతం అందించిన దేవా, తమిళ చిత్ర పరిశ్రమలో 'గానా' పాటల జానర్‌కు పితామహుడిగా ఎంతో ప్రాచుర్యం పొందారు. 1950లో చెన్నైలో జన్మించిన దేవా, జె.బి. కృష్ణ వద్ద శాస్త్రీయ సంగీతం అభ్యసించారు. 1986లో ‘మాట్టుకర మన్నారు’ సినిమాతో పరిశ్రమలోకి అడుగుపెట్టారు.

తెలుగులో ‘శ్రీమాన్ బ్రహ్మచారి’తో అరంగేట్రం చేసిన ఆయన.. మెగాస్టార్ చిరంజీవి ‘మాస్టర్’, పవన్ కల్యాణ్ ‘తొలిప్రేమ’ చిత్రాలకు అద్భుతమైన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. అలాగే ‘ఆటోడ్రైవర్’, ‘బాగున్నారా’, ‘నాగ’ తదితర చిత్రాలకు స్వరాలు సమకూర్చారు.

సూపర్ స్టార్ రజనీకాంత్ బ్లాక్‌బస్టర్ హిట్లు ‘బాషా’, ‘అన్నామలై’, ‘అరుణాచలం’ చిత్రాలకు దేవా అందించిన సంగీతం, నేపథ్య సంగీతం (BGM) భారతీయ సినిమాలో సరికొత్త రికార్డులు సృష్టించాయి.

దేవా కుమారుడు శ్రీకాంత్ దేవా కూడా ప్రసిద్ధ సంగీత దర్శకుడిగా కొనసాగుతుండగా, తమిళ నటుడు జై ఈయనకు మేనల్లుడే అవుతారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.