Lesbian: ఏంటి ఆ హీరోయిన్లు ఇద్దరు లెస్బియన్సా..? అందుకే భర్తకు విడాకులిచ్చిందా..!
Lesbian: బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ విడాకుల వార్తల నడుమ దిశా పటానీ పేరు తెరపైకి వచ్చింది.
Lesbian: ఏంటి ఆ హీరోయిన్లు ఇద్దరు లెస్బియన్సా..? అందుకే భర్తకు విడాకులిచ్చిందా..!
Disha Patani And Mouni Roy: బాలీవుడ్ గ్లామర్ క్వీన్ మౌనీ రాయ్, ఆమె భర్త సూరజ్ నంబియార్‌ల విడాకుల వ్యవహారం గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. తామిద్దరం ఇష్టపూర్వకంగానే విడిపోతున్నామని ఈ జంట ప్రకటించినప్పటికీ, వీరి విడిపోవడానికి గల కారణాలపై నెట్టింట రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మరో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ పేరు తెరపైకి రావడం, అది కాస్తా సరికొత్త వివాదానికి దారితీయడం బాలీవుడ్ వర్గాల్లో సంచలనం రేపుతోంది.
మౌనీ రాయ్, దిశా పటానీలు గత కొంతకాలంగా అత్యంత క్లోజ్‌గా ఉంటున్నారు. తరచూ కలిసి వెకేషన్లకు వెళ్లడం, పార్టీల్లో జంటగా సందడి చేయడం, ఒకరినొకరు హగ్ చేసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెటిజన్లు వీరిపై లెస్బియన్స్ అంటూ రూమర్స్ సృష్టించారు. దిశా పటానీ కోసమే మౌనీ రాయ్ తన వైవాహిక బంధాన్ని కూడా వదులుకుందనే స్థాయికి ఈ పుకార్లు వెళ్లాయి. తమపై వస్తున్న ఈ నెగెటివ్ ట్రోలింగ్‌కు, రూమర్లకు చెక్ పెట్టాలని మౌనీ రాయ్ భావించింది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో దిశా పటానీతో కలిసి ఉన్న ఒక ఫొటోను షేర్ చేస్తూ.. నా లిటిల్ సిస్టర్‌ను చాలా మిస్సవుతున్నాను అని క్యాప్షన్ పెట్టింది.
తామిద్దరం లెస్బియన్స్ కాదని, అక్కాచెల్లెళ్ల లాంటి స్వచ్ఛమైన స్నేహితులమని ప్రపంచానికి చాటిచెప్పడమే మౌనీ ఉద్దేశం. అయితే ఇక్కడే ఒక ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికే మౌనీ రాయ్ దానిని ఇన్‌స్టాగ్రామ్ నుంచి డిలీట్ చేసింది. మౌనీ రాయ్ ఆ పోస్ట్‌ను అంత అర్ధాంతరంగా డిలీట్ చేయడంతో సోషల్ మీడియాలో చర్చలు మరింత ఎక్కువయ్యాయి. నెటిజన్లు రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు: పోస్ట్ పెట్టగానే నెటిజన్ల నుంచి నెగెటివ్ కామెంట్స్, ట్రోల్స్ విపరీతంగా రావడంతో తట్టుకోలేక డిలీట్ చేసిందా? అనే అనుమానం తెర మీదకు వస్తుంది. లేదా తొందరపాటులో ఆ క్యాప్షన్ పెట్టాననే ఉద్దేశంతో వెనక్కి తగ్గిందా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
సాధారణంగా సెలబ్రిటీలు ఇలాంటి రూమర్లపై క్లారిటీ ఇస్తే వివాదాలు సర్దుమణుగుతాయి. కానీ మౌనీ రాయ్ క్లారిటీ ఇవ్వబోయి.. పోస్ట్ డిలీట్ చేయడంతో ఈ వ్యవహారం మరింత సస్పెన్స్‌గా మారింది. తామిద్దరం కేవలం స్నేహితులమే అని ఈ గ్లామర్ క్వీన్స్ ఎంతగా నిరూపించుకోవాలని చూస్తున్నా.. నెట్టింట వస్తున్న పుకార్లకు మాత్రం బ్రేక్ పడటం లేదు. మరి ఈ డిలీటెడ్ పోస్ట్ వివాదంపై మౌనీ రాయ్ ముందు ముందు ఎలా స్పందిస్తుందో చూడాలి.




