LIK OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న ప్రదీప్ రంగనాథన్ ‘ఎల్‌ఐకే’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
LIK OTT : ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) కథానాయకుడిగా, విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ ఫ్యూచరిస్టిక్ లవ్‌స్టోరీ
LIK movie
LIK OTT : ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) కథానాయకుడిగా, విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ ఫ్యూచరిస్టిక్ లవ్‌స్టోరీ ‘ఎల్‌ఐకే - లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (Love Insurance Kompany). ఏప్రిల్‌లో థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ (Amazon Prime Video) వేదికగా ఈ సినిమా మే 6 నుంచి అందుబాటులోకి రానుంది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ సదరు సంస్థ అధికారిక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు ఆడియోలోనూ స్ట్రీమింగ్ కానుంది.
ఫ్యూచరిస్టిక్ లవ్‌స్టోరీ.. విభిన్నమైన కాన్సెప్ట్
దర్శకుడు విఘ్నేశ్ శివన్ తనదైన శైలి కామెడీని జోడిస్తూ ఈ చిత్రాన్ని ఒక కొత్త ప్రపంచంలో ఆవిష్కరించారు. ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ సరసన కృతిశెట్టి హీరోయిన్‌గా నటించగా, విలక్షణ నటుడు ఎస్.జె. సూర్య కీలకమైన విలన్ పాత్రలో మెరిశారు. టెక్నాలజీ నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది.
ఆసక్తికరమైన కథా నేపథ్యం
ఈ సినిమా కథ 2040వ సంవత్సరంలో సాగుతుంది. ఆ కాలంలో ప్రేమ విఫలమైతే (Love Failure) కూడా బీమా కల్పించే సరికొత్త వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. యువత బలహీనతలను పెట్టుబడిగా మార్చుకుని సూర్య (ఎస్.జె. సూర్య) 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'ని ఏర్పాటు చేస్తాడు. దీని కోసం ఒక ప్రత్యేకమైన మొబైల్ యాప్‌ను కూడా రూపొందిస్తాడు. ఈ యాప్ ద్వారా యువతీయువకులు పరిచయాలు పెంచుకోవడం, ఇద్దరికీ నచ్చితే పెళ్లి చేసుకోవడం లేదంటే బ్రేకప్ చెప్పుకోవడం వంటివి చేస్తుంటారు.
వాసు .. దీమా లవ్ ట్రాక్
కథలో దీమా (కృతిశెట్టి) సోషల్ మీడియా , ఫోన్‌లకు విపరీతంగా అలవాటు పడిపోయిన అమ్మాయి. ఆమె కూడా ఎల్‌ఐకే యాప్‌లో సబ్‌స్క్రైబర్‌గా ఉండి, తనకి సరైన భాగస్వామిని వెతకమని ఆ యాప్‌ను కోరుతుంది. మరోవైపు వాసు (ప్రదీప్) అసలు ఫోనే వాడని వ్యక్తి. ఆయన ‘ఆర్గానిక్ లివింగ్ వరల్డ్’ అనే ప్రపంచంలో జీవిస్తుంటాడు. అయితే, తొలిచూపులోనే దీమాను ఇష్టపడిన వాసు, తన తండ్రికి ఇచ్చిన మాటను పక్కనపెట్టి ఆమె కోసం ఫోన్ కొని ఎల్‌ఐకే యాప్‌లో చేరుతాడు.
క్లైమాక్స్ ట్విస్ట్
ఎన్నో కష్టాలు పడి దీమాకు దగ్గరవుతున్న తరుణంలో, ఎల్‌ఐకే యాప్ వారిద్దరి మధ్య ఉన్న ‘లవ్ స్కోర్’ తక్కువని చూపిస్తుంది. దీంతో వాసు తనకు సెట్ కాడని భావించి దీమా అతడికి బ్రేకప్ చెబుతుంది. తన ప్రేమ ఫెయిల్ కావడానికి, నెగెటివ్ స్కోర్ రావడానికి సూర్యనే కారణమని తెలుసుకున్న వాసు అతడిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? మళ్ళీ తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడు? అన్నదే ఈ సినిమా మిగతా ఆసక్తికరమైన కథాంశం.




