Maa Ramudu Andarivadu: ‘మా రాముడు అందరివాడు’ ప్రీ రిలీజ్ ఈవెంట్: సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్!
Maa Ramudu Andarivadu: మా రాముడు అందరివాడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విశేషాలు. సెప్టెంబర్ 4న గ్రాండ్ రిలీజ్.
Maa Ramudu Andarivadu: ‘మా రాముడు అందరివాడు’ ప్రీ రిలీజ్ ఈవెంట్: సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్!
Maa Ramudu Andarivadu: అనుముల ప్రొడక్షన్స్ మరియు శ్రీరామ్ క్రియేషన్స్ బ్యానర్లపై అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం ‘మా రాముడు అందరివాడు’. యద్దనపూడి మైకిల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హీరో శ్రీరామ్ సరసన స్వాతి మందాడి జంటగా నటించారు. సీనియర్ నటుడు సుమన్, సమ్మెట గాంధీ, నాగ మహేష్, బాహుబలి ప్రభాకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా, హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన నిర్మాత వెంకట్ దుగ్గిరెడ్డి, దర్శకుడు శ్రీనివాస తేజ చిత్ర యూనిట్‌కు బెస్ట్ విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ నటుడు సుమన్ మాట్లాడుతూ.. చిత్రంలో హీరో శ్రీరామ్ డ్యూయెల్ రోల్‌లో అద్భుతంగా నటించారని, తాను మాత్రం ఒక మంచి మెసేజ్ ఇచ్చే ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తానని చెప్పారు. అలాగే నిర్మాత అనుముల లక్ష్మణరావు మాట్లాడుతూ.. తాను తొలిసారిగా ఫస్టాఫ్‌లో వైల్డ్ విలన్‌గా కనిపించనున్నానని, మారెడుమిల్లి ఫారెస్ట్ విజువల్స్, మనీష్ కుమార్ సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలిపారు. 200లకు పైగా థియేటర్లలో విడుదలవుతున్న తమ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు.
దర్శకుడు యుద్ధనపూడి మైకిల్ మాట్లాడుతూ.. సుమారు 14 నెలల ప్రయాణం తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని, తండ్రీకొడుకుల మధ్య వచ్చే ఎమోషన్స్ అందరికీ కనెక్ట్ అవుతాయని తెలిపారు. హీరో శ్రీరామ్ మాట్లాడుతూ.. చిన్న సినిమానా, పెద్ద సినిమానా అనేదాని కంటే కంటెంట్ ముఖ్యం అని, తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. హీరోయిన్ స్వాతి మందాడితో పాటు వేడుకలో పాల్గొన్న నటులు ఆకెళ్ల గోపాలకృష్ణ, అప్పారావు, వినోద్ తదితరులు సినిమా విజయంపై ధీమా వ్యక్తం చేశారు.




