Magadheera Sher Khan Role Secret: మగధీర షేర్ ఖాన్ పాత్ర....డిస్కో శాంతి చెప్పిన రహస్యం
Magadheera Sher Khan Role Secret:శివ సినిమాను తెలుగు సినిమా చరిత్ర గతిని ఎలా మార్చిందో... మగధీర కూడా తెలుగు సినిమా చరిత్రను మగధీరకు ముందు తరువాతగా విభజించారు.
Magadheera Sher Khan Role Secret
Magadheera Sher Khan Role Secret: శివ సినిమాను తెలుగు సినిమా చరిత్ర గతిని ఎలా మార్చిందో... మగధీర కూడా తెలుగు సినిమా చరిత్రను మగధీరకు ముందు తరువాతగా విభజించారు. 2009లో రాజమౌళి సృష్టించిన ఈ విజువల్ వండర్‌లో రామ్ చరణ్ పరాక్రమం ఓ ఎత్తైతే...షేర్‌ఖాన్‌గా రియల్ స్టార్ శ్రీహరి ప్రదర్శించిన గాంభీర్యం మరో ఎత్తు. అయితే, ఈ ఐకానిక్ పాత్ర గురించి ఆయన భార్య ఒకనాటి స్టార్ డ్యాన్సర్ డిస్కోశాంతి కొన్ని కీలక విషయాలను తెలియజేశారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక 'హీరో' భార్యగా ఆమె భయం
ఇటీవలే డిస్కోశాంతి ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. మగధీర సమయానికి శ్రీహరి టాలీవుడ్‌లో టాప్‌లీడ్ రోల్, హీరోగా నటిస్తున్నారు. హీరోపాత్రలను కాదని వేరే పాత్రలు చేస్తే...అటువంటివే వస్తాయనే భయంతో రాజమైళి ఆఫర్ చేసిన పాత్రను చేయవద్దని చెప్పినట్టు తెలిపింది. ఒక హీరో భార్యగా తన భర్త ఎప్పుడూ హీరోగా కనిపించాలనే కోరుకుంటాను. అందుకే రాజమౌళి పిలిచి వేషం గురించి చెప్పినపుడు అది సపోర్టింగ్ క్యారెక్టర్ అని తెలిసి వద్దని శ్రీహరికి చెప్పినట్టు తెలిపారు. స్టార్ హీరో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారితే కెరీర్ దెబ్బతింటుందేమోనన్న ఆందోళన ఆమెలో ఉండేది. ఆ భయంతోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేయవద్దని చెప్పినట్టు తెలియజేసింది.
పాత్రలోని పవర్ అర్థమయ్యాక
రాజమౌళి సినిమాల్లో ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. ఇక మగధీరలో పాత్ర ప్రాధాన్యత గురించి శ్రీహరికి పూర్తి ఆవగాహన ఉంది. అందుకే డిస్కోశాంతి మాట పక్కనపెట్టి ఆయన రోల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మగధీర సినిమాలో 100 మంది సైనికులను చంపే సీన్‌లో కాలభైరవుడి వీరత్వాన్ని గుర్తించి జోహార్లు అర్పించే షేర్‌ఖాన్ పాత్ర లేకపోతే సినిమా సాధారణంగా ఉండేది. షేర్ ఖాన్ పాత్ర... నరేషన్, డైలాగులు సినిమాకు ప్లస్ అయ్యాయి. సినిమా విడుదల తరువాత షేర్‌ఖాన్ పాత్రకు వచ్చిన రెస్పాన్స్ చూసి డిస్కోశాంతి ఆశ్చర్యపోయారు. రాజమౌళి షేర్‌ఖాన్ పాత్రను ఎంత మనసుపెట్టి తీర్చిదిద్దారో సినిమా చూశాక అర్ధమైందని అన్నారు. షేర్‌ఖాన్ పాత్ర లేకపోతే మగధీర లేదని అమె ఇప్పుడు సగర్వంగా చెప్పారు.
డిస్కోశాంతి - శ్రీహరి: ఒక ప్రేమ కావ్యం
డిస్కోశాంతి అసలుపేరు శాంత కుమారి. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తరువాత డిస్కోశాంతిగా పేరు మార్చుకుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో 900లకు పైగా సినిమాల్లో నటించింది. స్పెషల్ సాంగ్స్‌కు ఆమె పెట్టిందిపేరు. 1996లో శ్రీహరిని వివాహం చేసుకున్న తరువాత వెండితెరకు దూరంగా ఉంటూ కుటుంబానికే అంకితమయ్యారు. దురదృష్టవశాత్తూ 2013, అక్టోబరు 9న శ్రీహరి కాలేయ వ్యాధితో మరణించడం సినీలోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
ప్రస్తుతం తన పిల్లలే లోకంగా బతుకుతున్న డిస్కో శాంతి, శ్రీహరి జ్ఞాపకాలను పంచుకుంటూ అభిమానులను అలరిస్తున్నారు. 'మగధీర'లో శ్రీహరి కేవలం నటుడిగా మాత్రమే కాదు, ఒక వీరుడికి గౌరవం ఇచ్చే మరో వీరుడిగా చిరస్థాయిగా నిలిచిపోయారు. ఒకవేళ ఆమె మాట విని ఆయన ఆ పాత్రను వదులుకుని ఉంటే, తెలుగు ప్రేక్షకులు ఒక అద్భుతమైన నటనను కోల్పోయేవారు. 'మగధీర' కేవలం 100 రోజుల వేడుకలు జరుపుకోవడమే కాదు, అప్పట్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన ఇండస్ట్రీ హిట్‌గా రికార్డు సృష్టించింది. శ్రీహరి భౌతికంగా భూమిపై లేకున్నా ఆయన జ్ఞాపకాలు సినిమాల రూపంలో చిరస్థాయిగా నిలిచిపోయాయి.




