Mahesh Babu Yamaleela Story: మహేష్‌బాబు - సౌందర్య కాంబినేషన్లో ఆ సినిమా ఎందుకు ఆగిపోయిందో తెలుసా?
Mahesh Babu Yamaleela Story: వెండితెరపై కొన్ని కాంబినేషన్లు చాలా అరుదుగా ఉంటాయి. కొన్ని కాంబినేషన్లు తెరపైకి వస్తే చూడాలని అనుకునేవారు ఉంటారు.
Mahesh Babu Yamaleela Story
Mahesh Babu Yamaleela Story: వెండితెరపై కొన్ని కాంబినేషన్లు చాలా అరుదుగా ఉంటాయి. కొన్ని కాంబినేషన్లు తెరపైకి వస్తే చూడాలని అనుకునేవారు ఉంటారు. మహేష్‌బాబు కెరీర్ ప్రారంభమయ్యే సమయానికి మహానటిగా పేరుగాంచిన సౌందర్య స్టార్ హీరోయిన్‌గా ఇండస్ట్రీని ఏలుతున్నది. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా తీయాలని అనుకున్నాడు ఎస్వీ కృష్ణారెడ్డి. కానీ, ఈ అవకాశం కొన్ని కారణాల వలన ఆగిపోయింది. ఆ సినిమానే యమలీల. టాలీవుడ్‌లో ఈ సినిమా ఎన్ని రికార్డులు సృష్టించిందో చెప్పక్కర్లేదు.
ఎస్వీ కృష్ణా రెడ్డి మార్క్ కథ
అప్పట్లో వరుస హిట్లతో దూసుకుపోతున్న దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి ఒక విభిన్నమైన సామాజిక ఫాంటసీ కథను సిద్ధం చేసుకున్నారు. అదే 'యమలీల'. ఈ కథలో హీరోగా మహేష్ బాబు అయితే బాగుంటుందని ఆయన భావించారు. అప్పటికే మహేష్ బాబు బాలనటుడిగా మెప్పించి, హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్న తరుణం అది. హీరోయిన్‌గా స్టార్ నటి సౌందర్యను అనుకున్నారు. ఈ క్రమంలోనే కథను పట్టుకుని సూపర్ స్టార్ కృష్ణ గారి వద్దకు వెళ్లారు.
కృష్ణ గారి సలహా.. ఎందుకు వద్దన్నారంటే?
కథ విన్న కృష్ణ చాలా బాగుందని మెచ్చుకుంటూనే ఓ తండ్రిగా, అనుభవజ్ఞుడైన నటుడిగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమా వచ్చేనాటికి మహేష్‌బాబు వయసు 19 సంవత్సరాలు. ఈ సినిమాలో హీరోయిన్ అనుకుంటున్న సౌందర్య వయసు 22 ఏళ్లు. అప్పుడప్పుడే కుర్రాడిగా మారుతున్న వయసులో మహేష్‌బాబు ఉండటం, సౌందర్య అప్పటికే స్టార్ హీరోయిన్ కావడంతో వీరిద్దరి జోడి సెట్ కాదని కృష్ణ భావించాడు. అనుభవజ్ఞుడిగా మరో ఆలోచన కూడా చేశాడు కృష్ణ. యమలీల భారీ కథ. యముడితో పోరాడే పాత్రను అంత చిన్న వయసులో మహేష్‌బాబు హ్యాండిల్ చేయడం రిస్క్ అని వారించారు. మహేష్‌బాబు సినిమా ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టేందుకు ఇంకా సమయం ఉందని, వేరేవారితో సినిమా చేయమని కృష్ణ సలహా ఇచ్చాడు.
అలీ పంట పండింది
మహేష్‌బాబు కాదనడంతో ఈ సినిమా కథను తీసుకెళ్లి అలీకి చెప్పడం, కమెడియన్‌గా రాణిస్తున్న అలీ వెంటనే ఒప్పేసుకోవడంతో సినిమా పట్టాలెక్కింది. ఇంద్రజను హీరోయిన్‌గా తీసుకొని సినిమాను తీశాడు. 1994లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. కైకాల యముడి పాత్ర సినిమాకు హైలైట్‌గా మారింది. ఒకవేళ మహేష్‌బాబు ఆ సినిమా చేసి ఉంటే కెరీర్ ప్రారంభంలోనే భారీ బ్లాక్‌బస్టర్ హిట్ పడేది. కానీ, వయసురిత్యా ఆ కాంబినేషన్ తెరపైకి రాకుండా ఆగిపోయింది.
మొత్తంగా చూసుకుంటే, సినిమా ఇండస్ట్రీకి టైమింగ్ చాలా ముఖ్యం. ఈ కాంబినేషన్ మిస్ కావడం అభిమానులను నిరాశ పరిచినా... మహేష్‌బాబు రాజకుమారుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఓ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోల్లో ఒకరిగా నిలిచారు.




