Varanasi Update: ‘వారణాసి’ షూటింగ్ కంప్లీట్.. అసలైన బ్లాస్ట్ కోసం వెయిట్ చేయండి అంటూ మేకర్స్ క్రేజీ అప్‌డేట్!
Varanasi Update: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'వారణాసి' షూటింగ్ పూర్తయింది.
Varanasi Update: ‘వారణాసి’ షూటింగ్ కంప్లీట్.. అసలైన బ్లాస్ట్ కోసం వెయిట్ చేయండి అంటూ మేకర్స్ క్రేజీ అప్‌డేట్!
Varanasi Update: ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’ (Varanasi). సూపర్ స్టార్ మహేశ్‌బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తొలి చిత్రం కావడంతో దీనిపై ఆకాశమే హద్దుగా అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి చిత్రబృందం అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్‌ను పంచుకుంది. ఈ భారీ ప్రాజెక్ట్ షూటింగ్ పూర్తయినట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.
‘వారణాసి’ గ్లింప్స్ (టీజర్) విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా.. సినిమాకు సంబంధించి ఏదైనా అప్‌డేట్ ఇవ్వాలంటూ ఓ అభిమాని సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో మేకర్స్‌ను అడిగారు. దీనిపై చిత్రబృందం ఆసక్తికరంగా స్పందించింది.
‘‘షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సీజీఐ (CGI), రీ-రికార్డింగ్ పనులు కొనసాగుతున్నాయి. త్వరలోనే డబ్బింగ్ మొదలు పెట్టాలి. ప్రస్తుతానికి ఇదే అప్‌డేట్ అనుకోండి.. లేదంటే అసలైన బ్లాస్ట్ కోసం ఎదురుచూడండి’’ అంటూ మేకర్స్ రిప్లై ఇచ్చారు.
ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, పోస్ట్ ప్రొడక్షన్ పనుల దృష్ట్యా సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉందని ఇటీవల ప్రచారం జరుగుతోంది. తాజా రిప్లైలో మేకర్స్ రిలీజ్ డేట్‌పై ఎలాంటి ప్రస్తావన చేయకపోవడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
గతేడాది (2025) నవంబరు 15న ఈ సినిమా టైటిల్, మహేశ్‌బాబు ఫస్ట్‌లుక్‌తో పాటు గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో మహేశ్‌బాబు ‘రుద్ర’గా, గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ‘మందాకిని’గా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’గా శక్తివంతమైన పాత్రల్లో కనిపించనున్నారు.
భారతీయ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించేలా ఈ మూవీని ఏకంగా 50 భాషల్లో డబ్బింగ్ చేస్తున్నారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో భారీ ఎత్తున విడుదల చేసేందుకు మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.




