Mahesh Babu: ‘వారణాసి’ తర్వాత ఆ డైరెక్టర్‌తో మహేష్ బాబు సినిమా.. వద్దంటున్న ఫ్యాన్స్

Mahesh Babu: రాజమౌళి ‘వారణాసి’ తర్వాత మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో స్పోర్ట్స్ డ్రామా రాబోతుందనే వార్తలపై బాబు అభిమానులు అసంతృప్తి.

Naresh.k
Published on: 17 Jun 2026 10:14 AM IST
Mahesh Babu
X

Mahesh Babu: ‘వారణాసి’ తర్వాత ఆ డైరెక్టర్‌తో మహేష్ బాబు సినిమా.. వద్దంటున్న ఫ్యాన్స్

Mahesh Babu: సూపర్‌స్టార్ మహేష్ బాబు , టాలీవుడ్ జక్కన్న ఎస్‌.ఎస్‌. రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ‘వారణాసి’ సినిమాపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టైం ట్రావెల్ నేపథ్యంలో, పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ విజువల్ వండర్‌లో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో మెరువనున్నారు.

2027 సమ్మర్ కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఈ సినిమా ఇంకా సెట్స్‌పై ఉండగానే.. దీని తర్వాత మహేష్ బాబు చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించిన చర్చలు అప్పుడే టాలీవుడ్‌లో హీట్ పెంచుతున్నాయి. మహేష్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఇండస్ట్రీలోని టాప్ డైరెక్టర్లు క్యూ కడుతున్నారు.

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ వార్త తెగ హల్‌చల్ చేసింది. ‘వారణాసి’ పూర్తి కాగానే మహేష్ బాబు లైన్ లో ఇద్దరు దర్శకులు ఉన్నారనే ప్రచారం గట్టిగా సాగింది. ప్రభాస్‌తో 'స్పిరిట్' సినిమా పూర్తి చేసిన వెంటనే మహేష్ బాబుతో సినిమా చేయాలని సందీప్ ప్లాన్ చేస్తున్నారట. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు కూడా మహేష్‌తో సినిమా చేయడానికి ఎప్పటి నుంచో కంకణం కట్టుకుని కూర్చున్నారు. ఈ ఇద్దరిలో మొదట సందీప్ రెడ్డి వంగాతో, ఆ తర్వాత బుచ్చిబాబుతో మహేష్ సినిమాలు ఉంటాయని నిన్నటి వరకు నెటిజన్లు లెక్కలు వేశారు. కానీ, ఇప్పుడు సీన్ లోకి మరో క్రేజీ డైరెక్టర్ ఎంట్రీ ఇచ్చారు.

తాజాగా ఫిలిం నగర్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. రాజమౌళి సినిమా తర్వాత మహేష్ బాబు, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం ఉందట. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతుందని టాక్. అంతేకాదు, ఇందులో మహేష్ బాబు సరికొత్తగా ఒక స్పోర్ట్స్ కోచ్ పాత్రలో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు స్పోర్ట్స్ డ్రామా తోడైతే థియేటర్లలో పూనకాలే అని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

అనిల్ రావిపూడి ప్రాజెక్ట్‌పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం ఇవన్నీ ఫిలిం సర్కిల్స్‌లో వినపడుతున్న గాసిప్స్ మాత్రమే. అయితే అనిల్ రావిపూడితో మాత్రం సినిమా వద్దని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అనిల్ రావిపూడి రొటిన్ సినిమాలు తీస్తారని వాటిల్లో అంత కిక్ ఉండదని మహేష్ అభిమానుల వాదన. మరి జక్కన్నతో ‘వారణాసి’ లాంటి ప్రెస్టీజియస్ మూవీ కంప్లీట్ అయ్యాక.. సూపర్‌స్టార్ తన నెక్స్ట్ ఛాన్స్ సందీప్ రెడ్డి వంగాకు ఇస్తారా, బుచ్చిబాబుకు ఇస్తారా లేక అనిల్ రావిపూడితో కలిసి స్పోర్ట్స్ గ్రౌండ్‌లోకి దిగుతారా అనేది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story