Mahesh Babu: మహేష్ బాబు ఫ్యాన్స్‌కు పూనకాలే..'రుద్ర' వచ్చేశాడు..!

Mahesh Babu: మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రాజమౌళి 'వారణాసి' చిత్రం నుంచి 'రుద్ర' పోస్టర్లను విడుదల చేశారు.

Naresh.k
Updated on: 10 Aug 2026 8:06 AM IST
Mahesh Babu
X

Mahesh Babu: మహేష్ బాబు ఫ్యాన్స్‌కు పూనకాలే..'రుద్ర' వచ్చేశాడు..!

Varanasi Movie First Look : దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న అంతర్జాతీయ స్థాయి పాన్-వరల్డ్ అడ్వెంచరస్ వండర్ ‘వారణాసి’. మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి ఆయన పోషిస్తున్న ‘రుద్ర’ పాత్రకు సంబంధించిన రెండు పవర్‌ఫుల్ పోస్టర్లను రాజమౌళి విడుదల చేశారు. ‘వారణాసి’లో రుద్ర... ఉగ్ర రూపం ఒక్కటే ఆయన నైజం కాదు అంటూ రాజమౌళి ఇచ్చిన క్యాప్షన్‌తో పాటు, పొడవాటి జుట్టు, గడ్డంతో రఫ్ అండ్ టఫ్ లుక్‌లో ఉన్న మహేశ్ పిక్స్ నెట్టింట నిమిషాల్లోనే వైరల్‌గా మారాయి.

వారణాసి నగరానికి దూసుకొచ్చే ‘శాంభవి’ అనే భారీ ఉల్క ముప్పు నేపథ్యం. త్రేతాయుగం నుంచి కలియుగం వరకు, ఆఫ్రికన్ అడవుల నుంచి అంటార్కిటికా మంచు ఖండాలు, ప్రాచీన రోమ్ వరకు సాగే అద్భుతమైన టైమ్ ట్రావెల్ అడ్వెంచర్. మహేశ్ బాబు సరసన ప్రియాంకా చోప్రా జోనాస్ , విలక్షణ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ, కార్తికేయ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుమారు రూ. 1,400 - 1,500 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించారు.

అంటార్కిటికాలో షూటింగ్ జరుపుకున్న తొలి భారతీయ చిత్రంగా ఇది నిలవనుంది. 1.43:1 ఐమాక్స్ ఫార్మాట్‌లో సంపూర్ణంగా రూపుదిద్దుకుంటున్న తొలి నాన్-ఇంగ్లీష్ చిత్రంగా చరిత్ర సృష్టిస్తోంది. ఎం.ఎం. కీరవాణి స్వరాలు అందిస్తుండగా, వి. శ్రీనివాస్ మోహన్ వీఎఫ్ఎక్స్ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. ఈ పాన్-వరల్డ్ విజువల్ వండర్ 2027 ఏప్రిల్ 7న ఉగాది పండుగ కానుకగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 120 దేశాల్లో అత్యంత ఘనంగా విడుదల కానుంది.

https://x.com/ssrajamouli/status/2086262300328218742/photo/1

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story