Mahesh Babu: కొత్త వ్యాపారం మొదలెట్టిన మహేష్ బాబు.. వాళ్లే టార్గెట్!

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గేమింగ్ పరిశ్రమలోకి వ్యూహాత్మక ఇన్వెస్టర్‌గా అడుగుపెట్టారు.

Gagan kumar
Published on: 4 Nov 2026 8:48 AM IST
Mahesh Babu
X

Mahesh Babu: కొత్త వ్యాపారం మొదలెట్టిన మహేష్ బాబు.. వాళ్లే టార్గెట్!

Mahesh Babu Shotgun Games: తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్‌గా కోట్లాది మంది అభిమానాన్ని చూరగొన్న మహేష్ బాబు.. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా వ్యాపార రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఇప్పటికే సినిమా నిర్మాణం , ఆసియాలోనే అత్యుత్తమ మల్టీప్లెక్స్ అనుభవాన్ని అందించే AMB Cinemas, రియల్ ఎస్టేట్, ఫ్యాషన్ బ్రాండ్ The Humbl Coలతో విజయం సాధించిన ఆయన.. తాజాగా భారతదేశంలో అత్యంత వేగంగా పుంజుకుంటున్న గేమింగ్ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ వీడియో గేమ్ డెవలప్‌మెంట్ స్టూడియో షాట్‌గన్ గేమ్స్‌లో మహేష్ బాబు వ్యూహాత్మక ఇన్వెస్టర్‌గా భాగస్వామ్యమయ్యారు.

సాధారణంగా టెక్, గేమింగ్ స్టార్టప్‌లలో ఐఐటీ లేదా ఎన్ఐటీ గ్రాడ్యుయేట్ల హవా కనిపిస్తుంది. కానీ ఎలాంటి ప్రీమియం ఇంజనీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే, కేవలం తమ విజన్, ప్రతిభతో సూపర్ స్టార్ మహేష్ బాబును మెప్పించి ఇన్వెస్ట్‌మెంట్ సాధించారు ఈ కంపెనీ కో-ఫౌండర్లు జీత్ చందన్, విధిత్ మెహతా. జైన్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్‌లో జీత్ చందన్ ఇంటర్నేషనల్ బాకలారియేట్ డిప్లొమా పూర్తి చేశారు. అనిల్ సురేంద్ర మోదీ స్కూల్ ఆఫ్ కామర్స్ నుంచి ఫైనాన్స్‌లో విధిత్ మెహతా బీఎస్సీ పట్టా పొందారు. భారత్ నుంచి గ్లోబల్ స్థాయిలో పిసి , కన్సోల్ గేమింగ్ రంగాన్ని ఏలాలనే బలమైన ఆశయంతో వీరిద్దరూ షాట్‌గన్ గేమ్స్ సంస్థను ప్రారంభించారు.

షాట్‌గన్ గేమ్స్ సంస్థ ప్రస్తుతం తమ అత్యంత ప్రతిష్టాత్మక ఫ్లాగ్‌షిప్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ టేక్‌డౌన్‌పై శ్రమిస్తోంది. సమీప భవిష్యత్తులోని ముంబై నగరం నేపథ్యంగా సాగే హై-వోల్టేజ్ యాక్షన్-అడ్వెంచర్ గేమ్.

డ్యూరేషన్: 10 నుంచి 15 గంటల ప్లే టైమ్ నిడివితో రూపుదిద్దుకుంటోంది.

ప్లాట్‌ఫారమ్‌లు: కేవలం మొబైల్ గేమింగ్‌కే పరిమితం కాకుండా పీసీ , ప్లేస్టేషన్ 5 , ఎక్స్‌బాక్స్ వేదికలపై అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నారు.

టార్గెట్ మార్కెట్: అమెరికా, ఐరోపా, జపాన్ దేశాలలోని గ్లోబల్ గేమర్లను లక్ష్యంగా చేసుకుని రూపొందిస్తున్న ఈ గేమ్‌ను 2028 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని భావిస్తున్నారు.

ఈ ఇన్వెస్ట్‌మెంట్ ప్రకటనపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ మహేష్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ సినిమా ఇప్పటికే తన కథనాలు, ఎమోషన్స్‌తో ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటింది. తదుపరి అతిపెద్ద డిజిటల్ విప్లవం ఇంటరాక్టివ్ ఎంటర్‌టైన్మెంట్‌లోనే రాబోతోంది. కేవలం పెట్టుబడులకే పరిమితం కాకుండా, సినిమాల్లో నాకు ఉన్న అనుభవంతో గేమ్ క్యారెక్టర్ల డిజైన్, క్రియేటివ్ వరల్డ్ బిల్డింగ్ కాన్సెప్టులలో ఫౌండర్లకు మార్గదర్శకత్వం అందిస్తాను. మన దేశంలో సృజనాత్మక ప్రతిభకు కొదవలేదు. సినిమా రంగంలో స్టోరీ టెల్లింగ్‌ను గేమింగ్ ప్రపంచానికి అనుసంధానిస్తూ మహేష్ బాబు తీసుకున్న ఈ నిర్ణయం టెక్ వర్గాల్లోనూ, చలనచిత్ర రంగాన తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.