మూడు పెళ్లిళ్లు చేసుకుని 17 ఏళ్లు వృథా చేశా.. నటి షాకింగ్ కామెంట్స్..!

Meera Vasudevan: మూడు పెళ్లిళ్లు, వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకులపై మలయాళ నటి మీరా వాసుదేవన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Arun Chilukuri
Published on: 12 Nov 2026 4:48 PM IST
మూడు పెళ్లిళ్లు చేసుకుని 17 ఏళ్లు వృథా చేశా.. నటి షాకింగ్ కామెంట్స్..!
X

మూడు పెళ్లిళ్లు చేసుకుని 17 ఏళ్లు వృథా చేశా.. నటి షాకింగ్ కామెంట్స్..!

Meera Vasudevan: సినీ ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు అనేవి సర్వసాధారణమైపోయాయి. ఎప్పుడు ఎవరు ఒక్కటవుతారో, ఎప్పుడు విడిపోతారో చెప్పడం కష్టంగా మారింది. ఇదిలా ఉంటే, మలయాళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి మీరా వాసుదేవన్ తన వైవాహిక జీవితం గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుని వ్యక్తిగత జీవితంలో ఎన్నో వివాదాలు, ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఆమె.. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని ఆవేదనను పంచుకున్నారు.

కొడుకు కోసం మూడో పెళ్లి.. కానీ నిరాశే!

తన మూడో వివాహ బంధం బ్రేక్ కావడానికి గల కారణాలను వివరిస్తూ.. "నా మూడో భర్త నా కొడుకుపై చూపిన ప్రేమ, శ్రద్ధ చూసి ఈ బంధంలోకి అడుగుపెట్టాను. అతను నా కొడుకుకు మంచి తండ్రి అవుతాడని భావించాను" అని మీరా తెలిపారు. అయితే కాలక్రమేణా తన అంచనాలు తప్పాయని ఆమె వాపోయారు. భర్త మితిమీరిన ఆధారపడటం, ఇద్దరి ఆలోచనా విధానాలు, విలువల మధ్య తీవ్రమైన పొంతన లేకపోవడమే ఈ బంధం విడిపోవడానికి ప్రధాన కారణాలని స్పష్టం చేశారు. ప్రతి విషయంలోనూ భార్యను తల్లిలా చూసుకుంటూ స్పూన్-ఫీడింగ్ లాంటి ప్రొటెక్షన్ ఇచ్చే పురుషులతో తాను ముందుకు వెళ్లలేనని కుండబద్దలు కొట్టారు.

సమాజం ముద్ర వేసినా పట్టించుకోలేదు

తన పెళ్లిళ్ల గురించి మాట్లాడుతూ.. "చాలా మందికి ఇవి కేవలం గాసిప్స్‌లా అనిపించవచ్చు. కానీ, అది నా జీవితం" అంటూ మీరా ఎమోషనల్ అయ్యారు. సమాజం తనను ముగ్గురు పెళ్లిళ్లు చేసుకున్న స్త్రీగా ముద్ర వేసినప్పటికీ, తాను దానిని తట్టుకోగలిగానని చెప్పారు. ఇతరులు ఏమనుకుంటున్నారో తాను పట్టించుకోకపోవడమే అందుకు కారణమన్నారు. ఇతరుల అభిప్రాయాలు తనను ప్రభావితం చేయవని నమ్మడం తనలో గొప్ప మార్పు తెచ్చిందని తెలిపారు.

17 ఏళ్లు వృథా చేసుకున్నాను: మీరా భావోద్వేగం

ఇదే ఇంటర్వ్యూలో ఆమె మరింత స్పందిస్తూ.. తాను జీవితంలో ఏకంగా 17 సంవత్సరాలు వృథా చేశానని, అర్థం పర్థం లేని మూడు పెళ్లిళ్లకు తన సమయాన్ని కేటాయించానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంవత్సరాల్లో మరింత తెలివిగా వ్యవహరించి ఉండాల్సిందని, తనకు నచ్చిన సినిమాలు, ఫిట్‌నెస్, మంచి కమ్యూనిటీని సృష్టించడం, ఇతరులకు సేవ చేయడం వంటి వాటిపై దృష్టి పెట్టాల్సిందని అభిప్రాయపడ్డారు. తన తల్లిదండ్రులు, సోదరితో ఎక్కువ సమయం గడిపి ఉండాల్సిందని, కొందరు వ్యక్తుల వల్ల విలువైన సమయాన్ని కోల్పోయానని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా, బాల్యంలో తాను లైంగిక వేధింపుల బాధితురాలిగా మారడంతో తన జీవితం మరింత కష్టతరంగా సాగిందని మీరా వాసుదేవన్ కంటతడి పెట్టారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.