Manchu Manoj: వచ్చే ఎన్నికల్లో నా భార్య మౌనిక పోటీ చేస్తుంది

Manchu Manoj: నటుడు మంచు మనోజ్ తన భార్య భూమా మౌనిక రాజకీయ ఎంట్రీపై సంచలన ప్రకటన చేశారు. ఆమె వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారని స్పష్టం చేశారు.

Arun Chilukuri
Published on: 19 May 2026 2:35 PM IST
Manchu Manoj
X

Manchu Manoj: వచ్చే ఎన్నికల్లో నా భార్య మౌనిక పోటీ చేస్తుంది

Manchu Manoj: టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ తన సతీమణి భూమా మౌనిక రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో మౌనిక కచ్చితంగా ఎన్నికల బరిలో నిలుస్తారని ఆయన అధికారికంగా ప్రకటించారు. మే 20న తన పుట్టినరోజును పురస్కరించుకుని మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మనోజ్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలను విస్తృతం చేసేందుకు మనోజ్ ఇటీవల ‘ఐఖ్య ధైర్య సేనా సమితి’ (AIKYA) అనే సంస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనిపై వస్తున్న పొలిటికల్ రూమర్లకు మనోజ్ తెరదించారు. "ఐఖ్య అనేది కేవలం ప్రజల గొంతుకగా నిలబడటానికి పెట్టిన సంస్థ మాత్రమే. దీనికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు." అని మనోజ్ స్పష్టం చేశారు. ఈ సంస్థ సేవా కార్యక్రమాల కోసం ఎవరి దగ్గరా విరాళాలు సేకరించడం లేదని, తన సొంత సంపాదన, నిధులనే దీని కోసం వెచ్చిస్తున్నట్లు వెల్లడించారు.

సంస్థకు రాజకీయ రంగు పులమవద్దని కోరిన మనోజ్.. తమ ఫ్యామిలీ పాలిటిక్స్‌లో ఉంటుందని మాత్రం కుండబద్దలు కొట్టారు. "ప్రస్తుతం మేము రాజకీయాల్లో భాగమయ్యాం. నా భార్య మౌనిక వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తారు" అని ప్రకటించి పొలిటికల్ సర్కిల్స్‌లో హీట్ పెంచారు. రాయలసీమ ఫ్యాక్షనిస్ట్, దివంగత నేత భూమా నాగిరెడ్డి కుమార్తె అయిన మౌనిక.. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంచారు.

ప్రెస్‌మీట్‌లో ఓ జర్నలిస్ట్ స్పందిస్తూ.. "మీ నాన్న (మోహన్ బాబు) తో ఉన్న విభేదాలు, గొడవలు సద్దుమణిగాయా?" అని అడిగిన ప్రశ్నకు మనోజ్ తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. "ఆ విషయం నన్ను కాదు.. ఎవరిని అడగాలో మీ అందరికీ బాగా తెలుసు. కానీ ఆయన దగ్గరకు మైక్ పట్టుకుని వెళ్లేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త.. హెల్మెట్ పెట్టుకుని వెళ్ళండి" అంటూ నవ్వుతూ సరదాగా సెటైర్ వేశారు. దీంతో అక్కడ నవ్వులు విరిశాయి. సినిమాలతో పాటు ‘ఐఖ్య’ ద్వారా సమాజంలో మార్పు తీసుకురావడమే తన తదుపరి లక్ష్యమని మంచు మనోజ్ పేర్కొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story