Manchu Vishnu: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి మంచు విష్ణు అదిరిపోయే కౌంటర్..!

Manchu Vishnu: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన డ్రగ్ టెస్ట్ వ్యాఖ్యలపై మా ప్రెసిడెంట్ మంచు విష్ణు సోషల్ మీడియాలో ఘాటుగా స్పందించారు.

Naresh.k
Published on: 1 April 2026 10:01 AM IST
Manchu Vishnu Strong Counter to MLA Anirudh Reddy over Hero Drug Test Comments
X

Manchu Vishnu 

Manchu Vishnu: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఒకటే చర్చ.. అది డ్రగ్ టెస్టులు. సినిమా విడుదలకు, హీరోల వ్యక్తిగత పరీక్షలకు ముడిపెడుతూ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో కార్చిచ్చు రేపాయి. అయితే, ఈ వ్యాఖ్యలపై 'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించిన తీరు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

అసలేం జరిగింది?

ఇటీవల జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. "సినిమాలు విడుదల కావడానికి ముందు హీరోలు తప్పనిసరిగా డ్రగ్ టెస్టులు చేయించుకోవాలి. రిపోర్టులో నెగటివ్ వస్తేనే వారి సినిమాలను థియేటర్లలో ప్రదర్శించాలి" అని ఆయన డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉండి యువతను ప్రభావితం చేసే హీరోలు పారదర్శకంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.

మంచు విష్ణు రివర్స్ అటాక్

ఎమ్మెల్యే వ్యాఖ్యలు నేరుగా ఇండస్ట్రీని టార్గెట్ చేసినట్లు ఉండటంతో, మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా ఘాటుగానే స్పందించారు. కేవలం సినిమా రంగాన్నే ఎందుకు వేలెత్తి చూపిస్తున్నారని ప్రశ్నిస్తూ.. రాజకీయ నాయకులకు కూడా ఒక సవాల్ విసిరారు.

"సినిమా విడుదలకు ముందు మేము డ్రగ్ టెస్టులు చేయించుకోవడానికి సిద్ధమే. కానీ, అదే తర్కంతో ఆలోచిస్తే.. ఎన్నికల్లో పోటీ చేసే ప్రజాప్రతినిధులు కూడా ఎలాంటి టెస్టులు చేయించుకోవాలో ఎమ్మెల్యే గారు చెప్తారా?" అని ప్రశ్నించారు.ప్రజలను పాలించే ఎమ్మెల్యేలు, సమాజంలో అత్యంత బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండేవారు కూడా పారదర్శకంగా ఉండాలని, కేవలం గ్లామర్ ఫీల్డ్‌ను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని విష్ణు హితవు పలికారు.

నెట్టింట వైరల్ అవుతున్న కౌంటర్

కొంతకాలంగా టాలీవుడ్‌ను డ్రగ్స్ వ్యవహారం నీడలా వెంటాడుతున్న తరుణంలో, ఒక ఎమ్మెల్యే నేరుగా సినిమా రిలీజ్‌తో దీనిని ముడిపెట్టడం చర్చనీయాంశమైంది. దీనికి మంచు విష్ణు ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తప్పు ఎక్కడ ఉన్నా ప్రశ్నించాలి.. కానీ ఒకే రంగాన్ని బలిపశువును చేయడం కరెక్ట్ కాదు అంటూ నెటిజన్లు కూడా విష్ణు వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతున్నారు. రాజకీయ వర్గాల నుంచి ఈ కౌంటర్‌పై ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి. ఏది ఏమైనా, ప్రస్తుతం టాలీవుడ్ వర్సెస్ పొలిటికల్ వార్ మాత్రం పీక్స్‌కు చేరింది.

Naresh.k

Naresh.k

Next Story