మహేష్ బాబు ‘వారణాసి’, ‘రామాయణ’ బడ్జెట్లపై మనోజ్ బాజ్‌పాయ్ షాకింగ్ కామెంట్స్!
Manoj Bajpayee: సినిమాల బడ్జెట్లపై విలక్షణ నటుడు, ‘ది ఫ్యామిలీ మ్యాన్’ ఫేమ్ మనోజ్ బాజ్‌పాయ్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
మహేష్ బాబు ‘వారణాసి’, ‘రామాయణ’ బడ్జెట్లపై మనోజ్ బాజ్‌పాయ్ షాకింగ్ కామెంట్స్!
Manoj Bajpayee: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం అత్యంత భారీ బడ్జెట్‌తో, ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రాలలో రణబీర్ కపూర్ ‘రామాయణ’ , దర్శకేంద్రుడు ఎస్ఎస్ రాజమౌళి - సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న గ్లోబల్ అడ్వెంచర్ ‘వారణాసి’ మొదటి వరుసలో ఉన్నాయి. వేల కోట్ల బడ్జెట్లతో, దేశంలోనే మొట్టమొదటి ఐమ్యాక్స్ ఫార్మాట్ చిత్రాలుగా ఇవి హైప్ క్రియేట్ చేస్తున్నాయి.
అయితే, ఈ సినిమాల బడ్జెట్లపై విలక్షణ నటుడు, ‘ది ఫ్యామిలీ మ్యాన్’ ఫేమ్ మనోజ్ బాజ్‌పాయ్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ భారీ నెంబర్లన్నీ కేవలం పబ్లిసిటీ గిమ్మిక్స్ మాత్రమేనని ఆయన కొట్టిపారేశారు.
“ఆ వందల కోట్లు మీ బ్యాంక్ అకౌంట్లోకి రావుగా!”
తన తాజా చిత్రం ‘గవర్నర్’ ప్రమోషన్స్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మనోజ్ బాజ్‌పాయ్.. సినిమాల బడ్జెట్ హైప్‌పై ఘాటుగా స్పందించారు.
"ఈ 500 కోట్లు, 1000 కోట్లు, 4000 కోట్లు అనేవన్నీ కేవలం పీఆర్ (PR Tactic) కోసం వాడుకునే సాధనాలు మాత్రమే. గత 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఈ తంతు నడుస్తూనే ఉంది. ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు కూడా కంటెంట్ వదిలేసి కలెక్షన్లు, బడ్జెట్ల గురించే మాట్లాడుతున్నారు. ఎయిర్‌పోర్టులో నన్ను కలిసే అభిమానులు కూడా సినిమా నెంబర్ల గురించే అడుగుతుంటే నేను వారిని తిడుతుంటాను. ఆ వందల కోట్లలో ఒక్క రూపాయి అయినా మీ అకౌంట్లోకి వస్తుందా? సినిమా బాగుందా లేదా అనేది మాత్రమే ప్రేక్షకుడికి ముఖ్యం, బిజినెస్ అనేది కేవలం ప్రొడ్యూసర్ల వ్యవహారం."
‘గవర్నర్’ బజ్ కోసమేనా? నెటిజన్ల కౌంటర్లు!
మనోజ్ బాజ్‌పాయ్ ఆర్బీఐ గవర్నర్ పాత్రలో నటించిన పొలిటికల్ ఫైనాన్షియల్ డ్రామా ‘గవర్నర్’ జూన్ 12న థియేటర్లలోకి రాబోతోంది. 1990ల నాటి భారతదేశ ఆర్థిక సంక్షోభం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రస్తుతం మార్కెట్లో మినిమమ్ బజ్ లేదు. దీంతో, తన సినిమాకు ఎలాగైనా హైప్ తీసుకురావాలనే ఉద్దేశంతోనే.. మనోజ్ బాజ్‌పాయ్ కావాలనే ‘రామాయణ’, ‘వారణాసి’ లాంటి మోస్ట్ యాంటిసిపేటెడ్ చిత్రాలను టార్గెట్ చేశారని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
కారణం ఏదైనప్పటికీ, బడ్జెట్ నెంబర్ల కంటే కంటెంట్‌కే ప్రాధాన్యత ఇవ్వాలంటూ మనోజ్ బాజ్‌పాయ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
ఎస్ఎస్ రాజమౌళి - మహేష్ బాబుల ‘వారణాసి’ చిత్రంలో ప్రియాంకా చోప్రా కథానాయికగా నటిస్తుండగా, నితీష్ తివారీ ‘రామాయణ’లో రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ నటిస్తున్నారు.




