Meena Mohan Babu Funny Incident: మీనా అల్లరి భరించలేక...మొహన్‌బాబు బెదిరించాడట
Meena Mohan Babu Funny Incident: అలనాటి సీనియర్ నటి మీనా పేరు వినగానే మనకు పెద్దవైన ఆమె కళ్లు, అమాకత్వంతో కూడిన నటన గుర్తుకు వస్తుంది.
Meena Mohan Babu Funny Incident: మీనా అల్లరి భరించలేక...మొహన్‌బాబు బెదిరించాడట
Meena Mohan Babu Funny Incident: అలనాటి సీనియర్ నటి మీనా పేరు వినగానే మనకు పెద్దవైన ఆమె కళ్లు, అమాకత్వంతో కూడిన నటన గుర్తుకు వస్తుంది. ఆనాటి అగ్రహీరోలందరితో కలిసి నటించిన మీన తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన కొన్ని సరదా సంఘటనలను ఇటీవల ఆమె గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు తనను భయపెట్టిన తీరు, ఈ తరువాత వారి మధ్య ఏర్పడిన అనుబంధం గురించి మీనా చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
స్టార్ హీరోలతో అనుభవాలు
టాలీవుడ్‌లో బంగారు బొమ్మగా పేరు తెచ్చుకున్న మీనా చిరంజీవి నుంచి బాలకృష్ణ వరకు అగ్రహీరోలందరితో కలిసి నటించారు. ఎన్నో హిట్స్ అందించారు. అయితే, అగ్రహీరోలందరితో నటించినా వెంకటేష్‌తో కలిసి నటించడం చాలా సౌకర్యంగా ఉంటుందని అన్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చంటి, సుందరకాండ, సూర్యవంశం వంటి చిత్రాలు బ్లాక్‌బస్టర్ అయ్యాయి. చిన్న వయసులోనే సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన మీన సెట్స్‌లో మితభాషిగా ఉండేవారు. తెలుగుభాషపై పూర్తి పట్టు లేకపోవడంతో ఎక్కువగా మాట్లాడలేకపోయినట్టు మీనా తెలిపారు. షూటింగ్‌లో పిల్లలు ఉంటే వారితో సరదాగా ఆటలు ఆడుతూ తనలోని అల్లరితనాన్ని బయటపెట్టేదాన్నని గుర్తు చేసుకున్నారు.
మోహన్ బాబు 'బెదిరింపు' ముచ్చట
మీనా సినీ జీవితంలో అత్యంత ఆసక్తికరమైన అంశం మోహన్‌బాబుతో చేసిన అల్లరి మొగుడు సినిమా. ఈ సినిమా చేసేనాటికి మీనా వయసు చాలా తక్కువ. షూటింగ్ సమయంలో మంచు లక్ష్మీ, విష్ణులతో కలిసి అల్లరి చేస్తూ, అంత్యాక్షరి ఆడుతూ, మ్యూజికల్ చెయిర్స్ వంటివి ఆడేదానిని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తన అల్లరి ఎక్కువైందని మోహన్‌బాబు తన గంభీరమైన కంఠస్వరంతో హెచ్చరించారని, ఆయన క్రమశిక్షణ, స్వరం చూసి మీనా నిజంగానే భయపడిపోయినట్టు తెలిపారు. ఆయన తనను ఏదో అంటున్నారని, బెదిరిస్తున్నారని ఆమె భావించేవారు. కానీ, అది కేవలం ఆయన శైలి అని, మనసు వెన్న అని తర్వాత అర్థమైందని మీనా నవ్వుతూ చెప్పుకొచ్చారు.
మీనా కెరీర్‌లో గ్లామర్ పాత్రలకంటే కూడా అల్లరి పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. అయితే, తన అల్లరితనంతో అందరిని ఆకట్టుకున్న మీనా..తన వృత్తినైపుణ్యంతో మోహన్‌బాబు వంటి కఠినమైన వ్యక్తుల నుంచి కూడా ప్రశంసలు, గౌరవాన్ని అందుకున్నారు. దృశ్యం సినిమాలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన మీన తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, స్టార్ హోదాను సొంతం చేసుకున్న మీన..ఒదిగి ఉండే స్వభావమే ఆమెను ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచి ఉండేలా చేసింది.




