Mega 158 Update: 'మెగా 158' షూటింగ్‌కు ముహూర్తం ఖరారు.. మాస్ లుక్‌లో మెగాస్టార్ చిరంజీవి!

Mega 158 Update: మెగా 158 సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉన్నా.. కొన్ని కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఏప్రిల్ రెండో వారం నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

Rishvik
Published on: 24 March 2026 8:09 PM IST
Mega 158 Update Chiranjeevi–Bobby Film Shoot Begins Soon
X

Mega 158 Update: 'మెగా 158' షూటింగ్‌కు ముహూర్తం ఖరారు.. మాస్ లుక్‌లో మెగాస్టార్ చిరంజీవి!

'మెగాస్టార్' చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంతో సంక్రాంతికి బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. అదే ఊపుతో ఇప్పుడు తన తదుపరి చిత్రం మెగా 158 (#Mega158) కోసం సిద్ధమవుతున్నారు. 'వాల్తేరు వీరయ్య' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత డైరెక్టర్ బాబీ, చిరంజీవి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఏప్రిల్ నుంచి సెట్స్ పైకి..

నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉన్నా.. కొన్ని కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఏప్రిల్ రెండో వారం నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ నెలాఖరులోనే చిత్ర యూనిట్ ఘనంగా పూజా కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. తొలి షెడ్యూల్‌లో చిరంజీవికి సంబంధించిన పవర్‌ఫుల్ 'సోలో ఎంట్రీ' సీన్స్‌ను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.

సెంటిమెంట్ + మాస్ యాక్షన్:

డైరెక్టర్ బాబీ ఈ చిత్రాన్ని పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎమోషన్స్, మాస్ యాక్షన్ కలబోతగా తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా ఇందులో 'కూతురు సెంటిమెంట్' హైలైట్‌గా నిలవనుంది. చిరంజీవి మరోసారి తనదైన మాస్ అవతార్‌లో కనిపిస్తూనే.. తండ్రి పాత్రలో భావోద్వేగాలను పండించబోతున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.

చిరు సరసన ప్రియమణి:

ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్‌గా సీనియర్ నటి ప్రియమణిని తీసుకునే ఆలోచనలో మూవీ టీమ్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక అత్యంత కీలకమైన చిరు కూతురి పాత్ర కోసం మొదట కృతి శెట్టి పేరు వినిపించినప్పటికీ.. ప్రస్తుతానికి మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ దాదాపు ఖరారైనట్లు ఇండస్ట్రీ టాక్.

మ్యాజిక్ రిపీట్ అవుతుందా?:

గతంలో చిరు-బాబీ కాంబోలో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. మళ్ళీ అదే కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో మెగా అభిమానులు ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. మాస్ ఎలిమెంట్స్‌తో పాటు హృదయాన్ని హత్తుకునే ఎమోషన్స్ ఈ సినిమాలో ఉండబోతున్నాయని మేకర్స్ హింట్ ఇస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాపై క్లారిటీ రానుంది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story