Chiranjeevi: డీప్‌ఫేక్‌లపై చిరంజీవి పోరాటం.. కేంద్రానికి కీలక విజ్ఞప్తి!
Chiranjeevi: కృత్రిమ మేధ (AI) దుర్వినియోగం, డీప్‌ఫేక్‌లు, డిజిటల్ మోసాల నుంచి రక్షణ కల్పించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని మెగాస్టార్ చిరంజీవి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Chiranjeevi: డీప్‌ఫేక్‌లపై చిరంజీవి పోరాటం.. కేంద్రానికి కీలక విజ్ఞప్తి!
Chiranjeevi: కృత్రిమ మేధ (AI) సాంకేతికత దుర్వినియోగం, డీప్‌ఫేక్ వీడియోలు, పెరిగిపోతున్న డిజిటల్ మోసాల నుంచి ప్రజలకు, కళాకారులకు రక్షణ కల్పించేందుకు మెరుగైన భద్రతా చర్యలు తీసుకోవాలని మెగాస్టార్ చిరంజీవి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డిని కలిసి ప్రత్యేకంగా వినతిపత్రం అందించారు.
ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో జరిగిన సమావేశం అనంతరం, ఆయన సూచన మేరకే ఈ వినతిపత్రాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి అందించినట్లు చిరంజీవి తాజాగా తన సోషల్ మీడియా పోస్టులో వెల్లడించారు. ఏఐ సాంకేతికతను అడ్డుపెట్టుకుని కొందరు సృష్టిస్తున్న నకిలీ (డీప్‌ఫేక్) వీడియోలు, వాయిస్ క్లోనింగ్ వంటి వాటిని అడ్డుకునేందుకు దేశంలో కఠినమైన రక్షణ చర్యలు, చట్టాలు అవసరమని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా తన వినతిపై సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి చిరంజీవి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేసుకుని, ఈ అంశాలను తదుపరి చర్యల కోసం ముందుకు తీసుకెళ్తామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చినట్లు చిరు వెల్లడించారు. ‘‘కళాకారుల గౌరవం, వ్యక్తిగత గుర్తింపు, సృజనాత్మక హక్కులను కాపాడటంతో పాటు ప్రతి పౌరుడి డిజిటల్ భద్రతను పరిరక్షించడం మనందరి బాధ్యత’’ అని చిరంజీవి అభిప్రాయపడ్డారు.
కాగా, నవంబర్ 2న చిరంజీవి, రామ్ చరణ్‌లు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను మర్యాదపూర్వకంగా కలిసిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనూ డీప్‌ఫేక్ టెక్నాలజీల దుర్వినియోగం వల్ల ఎదురవుతున్న సవాళ్లపై ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు. ‘‘మా ఆందోళనలను అమిత్‌షా అర్థం చేసుకున్నారు. ప్రభుత్వం ఈ విషయాన్ని తక్షణమే పరిశీలించి, మరిన్ని భద్రతా చర్యలు, కఠినమైన శిక్షలను ప్రవేశపెట్టే దిశగా కృషి చేస్తుందని మాకు హామీ ఇచ్చారు’’ అని చిరంజీవి అప్పట్లో ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.




