అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళ ముద్దుగుమ్మ

Femina George: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ ఎవైటెడ్ ప్యాన్ ఇండియా మూవీ ‘రాకా’ రోజురోజుకూ అంచనాలను పెంచేస్తోంది.

Srinivas Rao
Published on: 1 Jun 2026 4:28 PM IST
Femina George
X

అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళ ముద్దుగుమ్మ

Femina George: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ ఎవైటెడ్ ప్యాన్ ఇండియా మూవీ ‘రాకా’ రోజురోజుకూ అంచనాలను పెంచేస్తోంది. ఈ సినిమా కాస్టింగ్ గురించి నెట్టింట రకరకాల వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో.. తాజాగా ఈ ప్రాజెక్ట్‌లోకి ఒక క్రేజీ మలయాళ బ్యూటీ ఎంట్రీ ఇచ్చింది. నెట్‌ఫ్లిక్స్ సూపర్ హిట్ చిత్రం ‘మిన్నల్ మురళి’ ఫేమ్ ఫెమినా జార్జ్ ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు స్వయంగా వెల్లడించింది.

బన్నీతో స్క్రీన్ షేర్.. నా కల నిజమైంది: ఫెమినా జార్జ్

ఇటీవల ఓ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఫెమినా.. ‘రాకా’ చిత్రంలో తాను భాగమైన విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘నేను అసలు ‘రాకా’ లాంటి ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో భాగమవుతానని అస్సలు ఊహించలేదు. నా కెరీర్‌లో ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో ఇదే అత్యంత భారీ చిత్రం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు. నేను చూసిన మొదటి బన్నీ సినిమా ‘హ్యాపి’. అప్పటినుంచే ఆయనకు నేను పెద్ద ఫ్యాన్ అయ్యాను. ఈ సినిమాలో నా పాత్ర నిడివి చిన్నదే అయినా.. ఇంత గొప్ప ప్రాజెక్ట్‌లో, నా ఫేవరెట్ హీరోతో నటించే అవకాశం రావడం ఒక కల నిజమైనట్లుగా ఉంది’’ అని ఎమోషనల్ అయ్యింది. తన లేటెస్ట్ మూవీ ‘డిస్కో’ షూటింగ్ పూర్తి కాగానే ‘రాకా’ టీమ్ నుండి తనకు పిలుపు వచ్చిందని ఆమె పేర్కొంది.

నలుగురు హీరోయిన్లు? జోరందుకున్న ప్రచారం!

ఈ క్రేజీ యాక్షన్ అడ్వెంచర్‌లో గ్లోబల్ బ్యూటీ దీపికా పదుకోణ్ మెయిన్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఫెమినా జార్జ్ కూడా ఈ ప్రాజెక్ట్‌లోకి అడుగుపెట్టడంతో ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ సినిమాలో మొత్తం నలుగురు హీరోయిన్స్ ఉంటారని, వారందరికీ కథలో చాలా కీలకమైన ప్రాధాన్యత ఉంటుందని టాక్. ఇప్పటికే ఈ లిస్ట్‌లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న పేర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఫెమినా ఎంట్రీతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది. మరి ఈ క్రేజీ కాస్టింగ్‌పై దర్శకుడు అట్లీ లేదా సన్ పిక్చర్స్ టీమ్ ఎప్పుడు అఫీషియల్ క్లారిటీ ఇస్తుందో చూడాలి.

Srinivas Rao

Srinivas Rao

శ్రీనివాస్ రావు జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలు అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏపీ7 ఏఎంలో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విశ్లేషణాత్మక దృక్పథంతో వార్తలకు కొత్త కోణాన్ని జోడిస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

Next Story