Monalisa Marriage: కేరళలో ప్రియుడిని పెళ్లాడిన కుంభమేళా మోనాలిసా

Monalisa Marriage: కుంభమేళాలో తన అందం.. అమాయకత్వంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన మోనాలిసా భోంస్లే తన ప్రియుడు మొహమ్మద్ ఫర్మాన్ ను కేరళలో పెళ్లాడింది. ఆ వివరాలు ఇలా..

KVD Varma
Published on: 12 March 2026 9:24 AM IST
Monalisa Marriage: కుంభమేళాలో తన అందం.. అమాయకత్వంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన మోనాలిసా కేరళలో పెళ్లాడింది.
X

Monalisa Marriage

Monalisa Marriage: ఆ మధ్య యూపీలో కుంభమేళా జరిగింది గుర్తుందిగా. ఆ ఆధ్యాత్మిక వేడుకల్లో అకస్మాత్తుగా ఒక అమ్మాయి హైలైట్ అయిపోయింది. అక్కడకు పూసలు అమ్ముకోవడానికి వచ్చిన మోనాలిసా భోంస్లే ఒక యూట్యూబర్ కెమెరాకు చిక్కడం.. ఆమె వీడియోకు విపరీతమైన ఫాలోయింగ్ రావడం.. తరువాత ఆమె పేరు సోషల్ మీడియాలో కొన్ని రోజు హల్ చల్ చేయడం వరుసగా జరిగిపోయిన విషయం కూడా తెలిసిందే. కుంభమేళాలో వైరల్ అయిన తర్వాత, మోనాలిసాకు అనేక సినిమా ఆఫర్లు వచ్చాయి. ఆమె ప్రస్తుతం మలయాళ చిత్రం 'నాగమ్మ' , తెలుగు చిత్రం 'లైఫ్' లలో నటిస్తోంది. ఇంత వరకూ బాగానే ఉంది. ఇప్పుడు ఈమె తన వ్యక్తిగత జీవితం విషయంలో మరోసారి వార్తల్లో నిలిచింది.

కేరళలో పోలీస్ స్టేషన్ కు మోనాలిసా..

కేరళలో సినిమా షూటింగ్ లో ఉన్న ఆమె అకస్మాత్తుగా తిరువనంతపురంలోని తంపనూర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి తన తల్లిదండ్రులపై ఫిర్యాదు చేసింది. తన తల్లిదండ్రులు తనకు బలవంతంగా పెళ్లి చేస్తున్నారనీ.. తాను వేరే వ్యక్తిని ప్రేమించాననీ.. అతనితో పెళ్లి జరిపించమని ప్రియుడితో సహా వచ్చి పోలీసులను ఆశ్రయించింది.

ప్రియుడితో పెళ్లి..

కేరళలో ఆమె వివాహానికి మద్దతు లభించింది. పోలీసులతో పాటు, అక్కడి రాజకీయనాయకులు కూడా ఆమె పెళ్లికి మద్దతు పలికారు. దీంతో తన ప్రియుడు మొహమ్మద్ ఫర్మాన్ ను కేరళలోని పూవార్ సమీపంలోని అరుమనూర్ ఆలయంలో వారి వివాహం జరిగింది. కేరళకు చెందిన అనేక మంది రాజకీయ ప్రముఖులు వారి వివాహానికి మద్దతు ఇచ్చారు. కేరళ మంత్రి వి. శివన్‌కుట్టి, ఎంపీ రహీమ్, అనేక మంది ఆమె వివాహానికి హాజరయ్యారు.

కేరళలోనే ఎందుకు?

మోనాలిసా మధ్యప్రదేశ్ ఇండోర్ కు చెందిన అమ్మాయి. ఆమె పెళ్లి చేసుకున్న వ్యక్తి మొహమ్మద్ ఫర్మాన్ మహారాష్ట్రకు చెందినవారు. వారు ఒక సినిమా సెట్‌లో కలుసుకున్నారు. మొహమ్మద్ కూడా సినిమా పరిశ్రమలో ఉన్నాడు. ఇద్దరూ చాలా దగ్గరయ్యారు. ఆరు నెలల్లో తమ మధ్య 60 ఏళ్ల సంబంధం పెరిగినట్లు అనిపిస్తుందని వారు చెప్పారు. ఇద్దరూ వేర్వేరు రాష్ట్రాలకు చెందినవారు. వారికి కేరళతో ఎలాంటి సంబంధం లేదు. అయితే, వారు కేరళకు వచ్చి వివాహం చేసుకోవడానికి ఒక కారణం ఉంది. కేరళ వారికి అత్యంత ఇష్టమైన ప్రదేశం. అక్కడి అందం, భద్రతకు వారు ముగ్ధులయ్యారు. అదీకాకుండా తమ వివాహం మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో అయితే సమస్యలు తలెత్తవచ్చని భావించినట్టు వారు చెప్పారు.

మొత్తమ్మీద ఓవర్ నైట్ స్టార్ అయి సంచలనం సృష్టించిన మోనాలిసా ఇప్పుడు తన పెళ్ళితోనూ అంతే సంచలనం సృష్టించింది.



KVD Varma

KVD Varma

Next Story